మోజారిటీ మార్క్ దాటాం.. 30 దాటుతాం

బిజెపి అధ్యక్షుడ అమిత్ షా న్యూఢిల్లీ : ఐదు, ఆరవ దశల పోలింగ్‌తో తమ పార్టీ ఆధిక్యత గీతను దాటి వెళ్లుతోందని బిజెపి అధ్యక్షులు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. స్థానిక బిజెపి కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలకు పోలింగ్ ముగిసిపోయిందని, ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేసే మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే దాటి వేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రచారానికి దిగిన తరుణంలో తాను జనం నాడిని పసికట్టినట్లు, రాబోయేది […] The post మోజారిటీ మార్క్ దాటాం.. 30 దాటుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
బిజెపి అధ్యక్షుడ అమిత్ షా

న్యూఢిల్లీ : ఐదు, ఆరవ దశల పోలింగ్‌తో తమ పార్టీ ఆధిక్యత గీతను దాటి వెళ్లుతోందని బిజెపి అధ్యక్షులు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. స్థానిక బిజెపి కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలకు పోలింగ్ ముగిసిపోయిందని, ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేసే మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే దాటి వేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రచారానికి దిగిన తరుణంలో తాను జనం నాడిని పసికట్టినట్లు, రాబోయేది మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వమే అని తాను ఖచ్చితంగా చెప్పగలనని చెప్పారు. ఐదో, ఆరో దశ పోలింగ్ సరళిని చూసిన తరువాత తన నమ్మకం మరింత పెరిగిందని , ఏడో దశ పోలింగ్ ముగిస్తే 300 సంఖ్యాబలం దాటుతామనే నమ్మకం ఉందని షా తెలిపారు.

ఎన్నికలలో ఎన్ని స్థానాలు గెలుస్తాయని అనుకుంటున్నారని మీడియా వారు అడుగుతున్నారని, దీనికి తాను ఇచ్చే సమాధానం ఇప్పటికే మెజార్టీ మార్క్ దాటామనేదే అని తేల్చిచెప్పారు. ఈ నెల 19వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ జరుగుతుంది. దీనితో మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మొత్తం 543 సభ్యుల లోక్‌సభలో ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన సాధారణ సంఖ్యాబలం 270. ఇది సింపుల్ మెజార్టీగా లెక్కలోకి వస్తుంది. గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 282 స్థానాలు వచ్చాయి. మునుపటి కన్నా ఎక్కువ స్థానాలను బిజెపి దక్కించుకుంటుందని, తిరిగి ప్రధాని అయ్యేది మోడీనే అని, జన స్పందన ఇందుకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.

ప్రతిపక్ష నేత ఎన్నికకే వారి భేటీ
ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదిత భేటీ గురించి అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు కలుస్తున్నట్లుగా ఉందని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నేతలు ఒక చోట కలుసుకోవాలని అనుకుంటున్నారని, ఇక టిఆర్‌ఎస్ ఇతర పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసందని, అయితే ఇటువంటి భేటీలతో తమ పార్టీకి వచ్చే నష్టం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ ఖాతా బలంగా ఉందని, ఇవి ఇటువంటి వాటితో తగ్గే ప్రసక్తే లేదని వెల్లడించారు. ప్రతిపక్షంగానే వారు ఇక ముందు కూడా నిలుస్తారు కాబట్టి, ప్రతిపక్ష నేత ఎంపికకు వారు భేటీకి దిగుతున్నట్లు భావిస్తున్నామని అన్నారు. చివరికి ప్రతిపక్ష నేత ఎవరనేది కూడా వారికి చిక్కు ముడి అవుతుందని, సీట్ల సంఖ్య తగ్గడంతో ఈసారి ఏ పార్టీ కూడా ప్రతిపక్ష నేత హోదాను అయినా సొంతంగా దక్కించుకునే పరిస్థితి ఉండదని తెలిపారు. లోక్‌సభలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సీట్లు వచ్చిన పార్టీ నుంచే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 44 స్థానాలే రావడంతో ఈ కనీస పదిశాతం సీట్లకు ఈ బలం తక్కువ కావడం గురించి షా ప్రస్తావించారు ఇప్పుడూ ఇదే జరుగుతుందని ఆయన నేరుగా చెప్పలేదు.

BJP has crossed majority mark after sixth phase of polls

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోజారిటీ మార్క్ దాటాం.. 30 దాటుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: