బిజెపి మాజీ ఎంపి వీడియో తీసి…. లైంగిక దాడి

Student

 

ఢిల్లీ: ఓ విద్యార్థిని తనపై బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోఫణలు చేయడమేకాకుండా దానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చిన్మయానంద్ లైంగిక దాడి కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆమె చేసిన ఆరోపణలకు సిట్ కు ఆధారాలు అందజేసినట్టు సమాచారం. ఉత్తర ప్రదేశ్ లోని షహజన్ పూర్ లో లా చదవడానికి చిన్మయానంద్ ను తాను కలిశానని సదరు అమ్మాయి పేర్కొంది.  కాలేజీలో ఆడ్మిషన్ ఇప్పించడమే కాకుండా ఐదు వేల రూపాయల ఉద్యోగం లైబ్రరీలో స్వామి ఇప్పించాడని ఆమె తెలిపింది. ఆ అమ్మాయికి హాస్టల్ లో వద్దని తన ఆశ్రమానికి రావాలని సదరు స్వామి సూచించాడు. ఆమె ఆశ్రమానికి వెళ్లగానే స్వామి సహాయకులు వేధింపులకు గురి చేశారు. హాస్టల్ లో తాను స్నానం చేసిన దృశ్యాలను చూపించి బ్లాక్ మెయిల్ చేసి తనని లైంగికంగా లొంగదీసుకున్నాడని  పేర్కొన్నారు. అతడి వేధింపులకు చాలా మంది అమ్మాయిలు బలయ్యారని చెప్పుకొచ్చారు. స్వామి చేసే వికృత చేష్టలను వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసి కాలేజీ నుంచి పారిపోయానని పేర్కొన్నారు.  వెంటనే చిన్మయానంద్ కేసును యుపి పోలీసులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఆరోపణలు రాజకీయ కోణంలో ఉన్నాయని చిన్మయానంద్ తోసిపుచ్చారు. 

 

 

 

The post బిజెపి మాజీ ఎంపి వీడియో తీసి…. లైంగిక దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.