రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌ : టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ కు తెలంగాణ హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమని, తన పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పై  అత్యవసర విచారణ అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఫోర్జరీ, డేటా చోరీ కేసులో  రవిప్రకాశ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు […] The post రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ కు తెలంగాణ హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమని, తన పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పై  అత్యవసర విచారణ అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఫోర్జరీ, డేటా చోరీ కేసులో  రవిప్రకాశ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన స్పందించలేదు. దీంతో రవి ప్రకాశ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రవి ప్రకాశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. బుధవారం ఆయన పోలీసుల ఎదుట హాజరుకాకపోతే, అరెస్టు వారెంట్ జారీ చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు శొంఠినేని శివాజీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వీరు ముంబయిలో తలదాచుకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం హైదరాబాద్ లోనే వారి సన్నహితుల వద్ద తలదాచుకున్నారని చెబుతున్నారు.

Bitter Experience To Ravi Prakash in High Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: