భూపతిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

MLC Bhupathi Reddyహైదరాబాద్‌ : ఎంఎల్ సి భూపతిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. శాసనమండలిలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. భూపతిరెడ్డిపై అనర్హత చట్టబద్ధంగానే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సభ్యులపై అనర్హత వేసే హక్కు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ లకు రాజ్యాంగం  ఇచ్చిందని కోర్టు తేల్చిచెప్పింది.  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని 8వ పేరాను సవాల్ చేస్తూ భూపతిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎంఎల్ సిగా ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరడం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వస్తుందన్న వాదనతో శాసనమండలి చైర్మన్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు చేశారు. భూపతిరెడ్డితో పాటు అనర్హతకు గురైన యాదవ రెడ్డి, రాములు నాయక్‌ల పిటిషన్‌లను కూడా ఇటీవల కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Bitter Experience To MLC Bhupathi Reddy In High Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భూపతిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.