ఎపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్ ప్రమాణస్వీకారం

Biswabhusan Harichandanఅమరావతి: ఎపి కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఎపికి తొలి గవర్నర్‌గా నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడకు వచ్చారు. సాయుధదళాల గౌరవవందం ఆయన అందుకున్నారు. సిఎస్ ఎల్ వి సుబ్రమణ్యం, గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు తదితులు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అభినందనలు తెలిపారు. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Biswabhusan Harichandan Sworn In As AP Governor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్ ప్రమాణస్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.