రైతుల ఖాతాల్లోనే బిల్లులు…

   నిజామాబాద్ : వరిధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులను రైతుల ఖాతాల్లోనే బదిలీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. ముందుగా పోలీసు గెస్ట్‌హౌస్‌కు చేరుకొని అనంతరం కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ధాన్యాన్ని రైతుల వద్ద నుండి మాత్రమే సేకరించాలని, వారి ఖాతాల్లోనే ధాన్యం ధరను జమచేయాలన్నారు. ప్రభుత్వం […] The post రైతుల ఖాతాల్లోనే బిల్లులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 నిజామాబాద్ : వరిధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులను రైతుల ఖాతాల్లోనే బదిలీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. ముందుగా పోలీసు గెస్ట్‌హౌస్‌కు చేరుకొని అనంతరం కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ధాన్యాన్ని రైతుల వద్ద నుండి మాత్రమే సేకరించాలని, వారి ఖాతాల్లోనే ధాన్యం ధరను జమచేయాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 48 గంటల లోగా సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాలో నిధులను జమచేయాలన్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తూకంలో తేడా లేకుండా చూడాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా ముందస్తుగా అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సేకరించిన ధాన్యాన్ని వెంటవెంట రైస్‌మిల్లులకు తరలించడానికి అవసరమైతే అదనంగా రవాణా సదుపాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. ధాన్యాన్ని దించుకోవడంలో కానీ లోడ్ వేయడంలో ఆలస్యం జరగకుండా చూడాలని అని ఆయన అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోవు మేరకు టార్పాలిన్లు ఉంచుకోవాలని మాయిశ్చర్ మిషన్లను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం రిసైకిలింగ్‌కు అవకాశం లేకుండా చూడాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఈ రబీలో మూడున్నర లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచన వేశామని, ఇప్పటి వరకు సహకార సంఘాలు, ఐకెపి, మెప్మా తదితర సంఘాల ఆద్వర్యంలో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకటిన్నర లక్షల టన్నుల సేకరించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి క్రిష్ణప్రసాద్, జిల్లా మేనేజర్ హరిక్రిష్ణ, డిసిఓ సింహచలం, డిఆర్‌డిఓ రమేష్‌రాథోడ్, ఆర్డిఓ డి.విరెడ్డి, మెప్మా పిడి రాములు, ఎడిఎ వాజీద్ హుస్సెన్, మార్కెట్ అధికారి రియాజ్, ఎఫ్‌సిఐ అధికారి, జిల్లా రైస్‌మిల్లింగ్ సంఘం ప్రతినిధులు మోహన్‌రెడ్డి, దయానంద్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

 

Bills in farmers’ accounts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రైతుల ఖాతాల్లోనే బిల్లులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: