ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌కు‘బిగిల్’ తెలుగు హక్కులు

Bigil movie

 

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’. ఇది వరకు ఈ హిట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరి కలయికలో ‘బిగిల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏజియస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తెలుగు,తమిళంలో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ ఎస్.కోనేరు మాట్లాడుతూ “బిగిల్ సినిమా హక్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌కు దక్కడం చాలా ఆనందంగా ఉంది.

నిర్మాత కల్పాతి అఘోరామ్, హీరో విజయ్‌కి స్పెషల్ థాంక్స్. ‘118’తో మా బ్యానర్‌లో సూపర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్తమనటి కీర్తిసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలో మా బ్యానర్‌లో విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘బిగిల్’ చిత్రాన్ని విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం”అని అన్నారు. వివేక్, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంతరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జి.కె.విష్ణు, సంగీతంః ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్‌ః రూబెన్.

Bigil movie Telugu rights to East Coast Productions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌కు‘బిగిల్’ తెలుగు హక్కులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.