సైన్యానికి సంఘీభావంగా సైకిల్‌ యాత్ర…

Bicycle tour

 

నేరడిగొండ: ఉత్తర్‌ప్రదేశ్ లోని జ్వాలోన్ జిల్లా ఒరయ్ పట్టణానికి చెందిన ప్రదీప్ రాతోడ్ అనే యువకుడు భారత సైన్యానికి సంఘీభావంగా దేశ వ్యాప్త సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఆదివారం ఆయన నేరడిగొండ కు చేరుకున్నాడు. ఈ యాత్రను జనవరి 21న ప్రారంభించి, ఇప్పటి వరకు 19 రాష్ట్రాలలో పర్యటిస్తూ 10 వేల కిలో మీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మరో 45 రోజుల్లో 10 రాష్ట్రాలు పర్యటించి 5 వేల కిలో మీటర్ల యాత్రను కొనసాగిస్తాని తెలిపారు.జమ్మూకశ్మీర్ చేరుకొని సైన్యానికి అభినందనలు తెలిపి సైకిల్‌యాత్ర ముగించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిత్యం 130 నుంచి 150 కిలో మీటర్లు ప్రయాణం చేసి, రాత్రికి బస చేసే చోట మన దేశ సైన్యం గురించి ప్రజలకు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనను నేరడిగొండ ఎఎస్సై కాత్లే రమేష్, కానిస్టేబుల్ సురేంధర్‌లు  అభినందించారు.

 

Bicycle tour in solidarity with the army

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సైన్యానికి సంఘీభావంగా సైకిల్‌ యాత్ర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.