భారత్‌కు మరో ఎదురుదెబ్బ.. గాయంతో భువీ ఔట్

 

మాంచస్టర్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో భువనేశ్వర్ కుమార్‌కు గాయమైంది. దీంతో  ఓవర్ మధ్యలోనే బౌలింగ్‌ని నిలిపివేసి మైదానాన్ని వీడాడు. దీంతో విజయ్ శంకర్ తో ఆ ఓవర్ను పూర్తి చేయాల్సి వచ్చింది. తాజాగా భువీ గాయంపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. తొడ కండరాల గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ మూడు మ్యాచ్‌లకి దూరంగా ఉండనున్నట్లు కోహ్లి తెలిపాడు. భారత్ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ జట్లతో ఆడనుండగా.. ఈ మ్యాచ్‌లకి భువనేశ్వర్ స్థానంలో మరో పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోనున్నారు.

కాగా, ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు వారాల పాటు టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ధావన్ స్థానంలో విజయ్ శంకర్‌ని జట్టులోకి తీసుకున్నారు.

Bhuvneshwar kumar injured ruled out of next 3 matches

The post భారత్‌కు మరో ఎదురుదెబ్బ.. గాయంతో భువీ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.