నిర్మలా సీతారామన్‌కు యువత ట్వీట్లతో కౌంటర్

న్యూఢిల్లీ: దేశంలోని యువత కార్లు కొనకుండా ఓలా, ఊబర్ తదితర క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడం కూడా ఆటో రంగం కుదేలు కావడానికి ఒక ప్రధాన కారణమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి యువతే కారణమని ధ్వనించే విధంగా ఉన్న ఆమె వ్యాఖ్యలు యువజనులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయనడానికి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ట్వీట్లే ఉదాహరణ. సేయిట్ లైక్ నిర్మలా, బాయ్‌కాట్‌మిలీనియల్స్(యువత) తదితర […] The post నిర్మలా సీతారామన్‌కు యువత ట్వీట్లతో కౌంటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: దేశంలోని యువత కార్లు కొనకుండా ఓలా, ఊబర్ తదితర క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడం కూడా ఆటో రంగం కుదేలు కావడానికి ఒక ప్రధాన కారణమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి యువతే కారణమని ధ్వనించే విధంగా ఉన్న ఆమె వ్యాఖ్యలు యువజనులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయనడానికి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ట్వీట్లే ఉదాహరణ. సేయిట్ లైక్ నిర్మలా, బాయ్‌కాట్‌మిలీనియల్స్(యువత) తదితర హ్యాష్‌ట్యాగ్‌లతో యువత తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం వేళల్లో యువత ఎక్కువ ఆక్సిజన్ పీలుస్తారు కాబట్టి దేశంలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తవచ్చు అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, యువత పానీ పూరీకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే బిహెచ్‌ఇఎల్ గత 15 ఏళ్లుగా క్షీణించింది అంటూ మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రం సంధించాడు. యువత దాల్ రోటీకి బదులు పిజ్జా తింటారు కాబట్టే తదేశంలో వ్యవసాయ రంగం పడిపోయింది అని మరో నెటిజన్ నిర్మలా సీతారామన్‌పై చెణుకులు రువ్వాడు. పెళ్లికి బదులు సహజీవనాన్ని ఇష్టపడుతున్న యువతను బహిష్కరించండి..ఎందుకంటే దీని వల్ల బ్రాహ్మణులు, పండితులు, జోతిష్కులకు పని లేకుండా పోతోంది అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. యువత ఎల్‌పిజిని వాడుతున్నారు కాబట్టే కోల్ ఇండియా ఉత్పత్తి పడిపోయింది అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

 

 

 

 

BHEL Down, Millennials Prefer Paani Puri: #BoycottMillennials Trends After FMs Comment
While we get where Sitharaman may have been coming from, is it really fair to blame the millennials for everything that goes wrong with the world?

The post నిర్మలా సీతారామన్‌కు యువత ట్వీట్లతో కౌంటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: