ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగే షాక్ !

ముంబయి: దేశంలోని అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్‌కు డిసెంబర్ నెలలో గట్టి షాక్ తగిలింది. ఎయిర్‌టెల్‌ డిసెంబరులో ఏకంగా 5.7 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన వినియోగదారు డేటా ఆధారంగా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో నవంబరులో 34.1 కోట్ల మంది మొబైల్ వినియోగదారులతో ప్రత్యర్థి కంపెనీలకు అందనంత దూరంలో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ డిసెంబరు చివరి నాటికి 28.42 కోట్లకు పడిపోవడం గమనార్హం. ఇక టెలికం రంగంలోకి […]

ముంబయి: దేశంలోని అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్‌కు డిసెంబర్ నెలలో గట్టి షాక్ తగిలింది. ఎయిర్‌టెల్‌ డిసెంబరులో ఏకంగా 5.7 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన వినియోగదారు డేటా ఆధారంగా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో నవంబరులో 34.1 కోట్ల మంది మొబైల్ వినియోగదారులతో ప్రత్యర్థి కంపెనీలకు అందనంత దూరంలో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ డిసెంబరు చివరి నాటికి 28.42 కోట్లకు పడిపోవడం గమనార్హం. ఇక టెలికం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు యూజర్లు పెరుగుతున్నారు. డిసెంబర్ చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 28 కోట్లు. అంటే ఎయిర్‌టెల్‌కు జియో కంటే కేవలం 42 లక్షలు వినియోగదారులు మాత్రమే అధికంగా ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో జియో టాప్ టెలికం ఆపరేటర్ గా అవతరించడం ఖాయం.

Bharti Airtel loses 5.7 Crore mobile customers in December

Related Stories: