భారత్ దర్శన్ టూర్‌కు గిరిజన వసతి గృహ విద్యార్థి

  మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో భారత్ దర్శన్ టూర్ కు మహబూబ్‌నగర్ ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహ విద్యార్థి ఆ ర్. భాస్కర్ సెలక్ట్ అయినట్లు హెచ్ డబ్లూఓ సనాతన బాలస్వామి తెలిపారు. వసతి గృహ హె చ్‌డబ్లూఓ సనాతన బాలస్వామి మాట్లాడుతూ ఆర్. భాస్కర్ ప్రస్తుతం 9వ తరగతి పోలీస్ లైన్ ప్రభుత్వ హై స్కూల్ మహబూబ్‌నగర్ చదువుతున్నాడని, ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం […] The post భారత్ దర్శన్ టూర్‌కు గిరిజన వసతి గృహ విద్యార్థి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో భారత్ దర్శన్ టూర్ కు మహబూబ్‌నగర్ ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహ విద్యార్థి ఆ ర్. భాస్కర్ సెలక్ట్ అయినట్లు హెచ్ డబ్లూఓ సనాతన బాలస్వామి తెలిపారు. వసతి గృహ హె చ్‌డబ్లూఓ సనాతన బాలస్వామి మాట్లాడుతూ ఆర్. భాస్కర్ ప్రస్తుతం 9వ తరగతి పోలీస్ లైన్ ప్రభుత్వ హై స్కూల్ మహబూబ్‌నగర్ చదువుతున్నాడని, ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం మహబూబ్‌నగర్ 3వ తరగతిలో ప్రవేశం పొంది అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక క్రీడలలో బహుమతులు పొందాడని అన్నారు.

అంతేకాకుండా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ నిర్వహించిన స్టేట్ లెవల్ ట్రేబల్ గేమ్స్ , స్పోర్ట్ మీట్ 2018–19 భద్రచలంలో జరిగింది. అప్పుడు స్టేట్ లెవల్ 400 మీటర్ల రన్నింగ్‌లో ఆర్. భాస్కర్ తృతీయ రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం వల్ల ఆ విద్యార్థి పేరున భారత్ దర్శన్‌కు పంపించగా మా డిపార్ట్‌మెంట్ వారు 13.09.2019 నుండి 16.09.2019 వరకు విశాఖపట్నం అరకు గుహలు అనేక ప్రదేశాలను డిపార్ట్‌మెంట్ ఉచితంగా భాస్కర్‌కు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా రు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణనాయక్ ఆ విద్యార్థిని తమ కార్యాలయంలో అభినందించారు.

Bharat Darshan is a Tribal Hostel Student on Tour

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్ దర్శన్ టూర్‌కు గిరిజన వసతి గృహ విద్యార్థి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: