ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్

  ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో’. ఈ చిత్రం ద్వారా కమేడియన్, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం యంగ్ హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంతకు మించి ఎంటర్‌టైనింగ్ ఉంటుందని భావిస్తున్నాను. […] The post ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో’. ఈ చిత్రం ద్వారా కమేడియన్, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం యంగ్ హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంతకు మించి ఎంటర్‌టైనింగ్ ఉంటుందని భావిస్తున్నాను.

సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః భరణి కె.ధరణ్, మ్యూజిక్‌ః సాకేత్ కొమండూరి, ఎడిటర్‌ః ఆవుల వెంకటేశ్, ఆర్ట్‌ః రఘు కులకర్ణి.

Bhagyanagara veedhullo movie trailer release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: