శబ్దంతో జాగ్రత్త!

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కాలుష్యం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. శబ్ద కాలుష్యంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. బయట ట్రాఫిక్, మ్యూజిక్ నగరవాసుల పాలిట కాలుష్యం సృష్టిస్తుంది. తరచూ భయంకరమైన శబ్దాలు వింటే ఊబకాయం తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అది వాళ్ల పరిశోధనలో తేలిందట. అది వాహనాల హారన్లు కావచ్చు, మైక్‌సెట్లు కావచ్చు, డిజే వంటి స్పీకర్లు కావచ్చు కారణమేదైనా అధిక శబ్దాల వల్ల బరువు పెరుగుతారని వాళ్లు […] The post శబ్దంతో జాగ్రత్త! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కాలుష్యం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. శబ్ద కాలుష్యంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. బయట ట్రాఫిక్, మ్యూజిక్ నగరవాసుల పాలిట కాలుష్యం సృష్టిస్తుంది. తరచూ భయంకరమైన శబ్దాలు వింటే ఊబకాయం తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అది వాళ్ల పరిశోధనలో తేలిందట. అది వాహనాల హారన్లు కావచ్చు, మైక్‌సెట్లు కావచ్చు, డిజే వంటి స్పీకర్లు కావచ్చు కారణమేదైనా అధిక శబ్దాల వల్ల బరువు పెరుగుతారని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల ఒత్తిడి పెరిగి అది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జీవక్రియ దెబ్బతింటుంది. హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడుతుంది. బీపీ పెరుగుతుంది. అది అలాగే కొనసాగితే దీర్ఘకాలంలో మానసిక సమస్యలు ఏర్పడవచ్చంటున్నారు. ఎంత వీలైతే అంత జాగ్రత్త ఉండటం మంచిది.

beware of noise pollution

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శబ్దంతో జాగ్రత్త! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.