గెలుపు …ఓటమిలపై జోరుగా బెట్టింగ్‌లు

కరీంనగర్ : ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి  ప్రస్తుత ఎంపి వినోద్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి  మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌గౌడ్, బిజెపి నుంచి  రాష్ట్ర నాయకుడు బండి సంజయ్‌కుమార్‌లు పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగగా ఏవరూ విజయం సాధిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడు అనే విషయమై నియోజకవర్గంలోని […] The post గెలుపు … ఓటమిలపై జోరుగా బెట్టింగ్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ : ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి  ప్రస్తుత ఎంపి వినోద్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి  మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌గౌడ్, బిజెపి నుంచి  రాష్ట్ర నాయకుడు బండి సంజయ్‌కుమార్‌లు పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగగా ఏవరూ విజయం సాధిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడు అనే విషయమై నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు.  వినోద్‌కుమార్ గెలుస్తాడని కొందరు, బండి సంజయ్‌కుమార్ గెలుస్తాడని మరికొందరు వీరు కాకంపడా పొన్నం ప్రభాకర్‌గౌడ్ గెలుస్తాడని మరికొందరు జోరుగా బెట్టింగ్‌లు కడుతున్నట్లు సమాచారం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సైతం బెట్టింగ్‌లో పాల్గొంటూ వేలాది రుపాయలను బెట్టింగ్ కడుతూ తమ నాయకుడిపై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకోసం హోటళ్ళు, లాడ్జింగ్‌లు, గెస్ట్‌హౌజ్‌లను వేదికలుగా ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాము గెలుస్తాడని చెబుతున్న అభ్యర్థి గెలుపుకు గల కారణాలను సైతం వారు వివరిస్తూ మరి బెట్టింగ్‌లు కడుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఈసారి ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటుచేసుకోబోతుందని బెట్టింగ్ కట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అందరూ అనుకుంటున్న వారు కాకుండా కొత్తవారు విజయం సాధించడం ఖాయమని బెట్టింగ్‌లు కడుతున్నరని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల విజయాలపై జరుగుతున్న బెట్టింగ్‌ల విషయంలో పోలీసులు మాత్రం ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నా,తమ దృష్టికి వస్తే వదిలిపెట్టే సమస్యే లేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. బెట్టింగ్‌లు కట్టడం చట్టపరంగా నేరమంటూ,అలాంటి వారు ఎవరూ తమ దృష్టికి వచ్చిన తప్పక చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన అంటున్నారు. ఈ విషయమై తప్పకుండా విచారణ చేస్తామని,అలాంటి వారు ఏవరూ కనిపించినా వెంటనే వారిని అదుపులోనికి తీసుకుని చర్యలు తీసుకుంటామని సదరు పోలీసు అధికారి తెలిపార. ఎన్నికల పుణ్యమా అని లక్షలాది రుపాయల బెట్టింగ్ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 23న రానున్న విషయం విదితమే.

Bettings on Loksabha Election Results

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గెలుపు … ఓటమిలపై జోరుగా బెట్టింగ్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: