నోరూరించే మిల్క్‌షేక్స్

మండే ఎండల్లో గొంతెండి దాహార్తి ఎక్కువవుతుంటుంది. ఎన్ని పానియాలైనా గుటకేయాలనిపిస్తుంది. చల్లనివే కాక, రుచిని, రంగుని కూడా జోడిస్తే అమాంతంగా ఆకర్షణ కూడా జోడై, అభిరుచికది తోడై దేహంలోని వేడిని చల్లగా బుజ్జగించేస్తాయి. రండి కాస్త రుచి చూద్దాం! స్ట్రాబెర్రీ కావాల్సినవి: స్ట్రాబెర్రీ ముక్కలు- అరకప్పు (శుభ్రంచేసి తరిగిపెట్టుకున్నవి), తేనె- రెండు చెంచాలు, కాచి చల్లార్చిన పాలు- ఒక కప్పు, పెరుగు- ఒక కప్పు, స్ట్రాబెర్రీలు- అలంకరణ కోసం రెండు తయారీ: ముందుగా స్ట్రాబెర్రీలూ, తేనెని మిక్సీ […] The post నోరూరించే మిల్క్‌షేక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మండే ఎండల్లో గొంతెండి దాహార్తి ఎక్కువవుతుంటుంది. ఎన్ని పానియాలైనా గుటకేయాలనిపిస్తుంది. చల్లనివే కాక, రుచిని, రంగుని కూడా జోడిస్తే అమాంతంగా ఆకర్షణ కూడా జోడై, అభిరుచికది తోడై దేహంలోని వేడిని
చల్లగా బుజ్జగించేస్తాయి. రండి కాస్త రుచి చూద్దాం!

స్ట్రాబెర్రీ

కావాల్సినవి: స్ట్రాబెర్రీ ముక్కలు- అరకప్పు (శుభ్రంచేసి తరిగిపెట్టుకున్నవి), తేనె- రెండు చెంచాలు, కాచి చల్లార్చిన పాలు- ఒక కప్పు, పెరుగు- ఒక కప్పు, స్ట్రాబెర్రీలు- అలంకరణ కోసం రెండు
తయారీ: ముందుగా స్ట్రాబెర్రీలూ, తేనెని మిక్సీ లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమానికి పాలు, పెరుగు కలుపుకుని మరోసారి మిక్సీ పట్టాలి. దాన్ని గ్లాసుల్లోకి తీసుకుని అంచులకు స్ట్రాబెర్రీలను అలంకరించుకుంటే స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ రెడీ. స్ట్రాబెర్రీలను డీప్ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తీస్తే మిక్సీలో వేసినప్పుడు మరీ మెత్తగా అయిపోకుండా పలుకుపలుకులుగా ఉండి జ్యూస్ చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. ఇష్టమైన వాళ్లు పంచదార, అరటిపండ్లని కలుపుకుని తాగొచ్చు.

పైనాపిల్

కావాల్సినవి: తాజా పైనాపిల్ పండు రసం – రెండు కప్పులు, దాల్చినచెక్క పొడి అర చెంచా, తేనె – రెండు స్పూన్లు, చల్లటి పాలు – అరకప్పు, చల్లటి పెరుగు – కప్పు.
తయారీ: ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైనాపిల్‌పండు రసం, దాల్చినచెక్క పొడి కలిపి గ్లాసుల్లోకి తీసుకుంటే చాలు.

 

సపోటా

కావాల్సినవి: సపోటా ముక్కలు – కప్పు, పాలు – అరకప్పు, తేనె – రెండు స్పూన్లు, ఐస్ ముక్కలు – కొన్ని.

తయారీ: మిక్సీలో ఐస్ ముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని మిల్క్‌షేక్‌లా చేసుకోవాలి. దీన్ని గ్లాసుల్లోకి తీసుకున్నాక ఐస్‌ముక్కలు వేసుకుంటే చాలు.

 

యాపిల్

కావాల్సినవి: యాపిల్ ముక్కలు – పెద్ద కప్పు, గింజల్లేని ఖర్జూరాలు మూడు (సన్నగా తరగాలి), తేనె – పావుకప్పు, చల్లటి పాలు – ఒకటిన్నర కప్పు.
తయారీ: యాపిల్, ఖర్జూర ముక్కలు, పెద్ద చెంచా తేనె, అరకప్పు పాలు తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. యాపిల్ ముక్కలు ముద్దగా అయ్యాక మిగిలిన పాలు, తేనె వేసి మరోసారి మిక్సీ పట్టాలి. చివరగా గ్లాసుల్లోకి తీసుకుని నాలుగు ఐస్‌ముక్కలు వేసుకుంటే చాలు. చల్ల చల్లటి యాపిల్ మిల్క్‌షేక్ తయారైనట్లే.

 

వాటర్‌మెలన్

కావాల్సినవి: తాజా పుచ్చకాయ ముక్కలు – మూడు కప్పులు, పుదీనా ఆకులు – పావుకప్పు, తాగే సోడా అరకప్పు, వెనిల్లా ఐస్‌క్రీం – నాలుగు పెద్ద చెంచాలు.
తయారీ: మొదట పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు మిక్సీలోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ రసంలా చేసుకోవాలి. ముందుగా గ్లాసుల్లోకి వెనిల్లా ఐస్‌క్రీం తీసుకుని తరవాత వడకట్టిన పుచ్చకాయ రసం వేయాలి. చివరగా కొద్దిగా తాగే సోడా వేసుకుని పైన రెండు పుదీనా ఆకులు అలంకరిస్తే చాలు.

మ్యాంగో

కావాల్సినవి: బాగా పండిన మామిడిపండ్లు – 2 (ముక్కల్లా కోయాలి), చల్లటి పాలు – ఒకటిన్నర కప్పు, వెనిల్లా ఐస్‌క్రీం – మూడు పెద్ద చెంచాలు, చక్కెర లేదా తేనె – రుచికి సరిపడా.
తయారీ: పైన పదార్థాలన్నీ మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉందనుకుంటే రెండుమూడు ఐస్‌ముక్కలు వేసుకుంటే కాస్త పల్చగా అవుతుంది. దీన్ని చలచల్లగా తాగితే బాగుంటుంది.

Best Tasty Milkshakes in summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నోరూరించే మిల్క్‌షేక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: