పానీపూరీ అడ్డా

దక్షిణభారత దేశంలో అతి పెద్ద పర్యాటకప్రదేశంగా హైదరాబాద్‌కి గొప్ప పేరుంది. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్, గోల్కొండ, నోరూరించే హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు పులకరించిపోతారు పర్యాటకులు. అలాగే రుచికరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను అందించడంలో కూడా ముందుంది మన నగరం. పత్తర్‌గట్ : మదీనా సర్కిల్‌లో కొన్ని స్ట్రీట్‌ఫుడ్ అవుట్లెటు, రెస్ట్టరెంట్లు కూడా ఉన్నాయి. టీ, బిస్కెట్లు వీధుల చుట్టూ తిరిగి అమ్మేవాళ్ళు ఇక్కడ సాధారణంగా కనిపిస్తారు. ప్రగతి గల్లీ : ప్రగతి గల్లీ హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో గల […] The post పానీపూరీ అడ్డా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దక్షిణభారత దేశంలో అతి పెద్ద పర్యాటకప్రదేశంగా హైదరాబాద్‌కి గొప్ప పేరుంది. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్, గోల్కొండ, నోరూరించే హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు పులకరించిపోతారు పర్యాటకులు. అలాగే రుచికరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను అందించడంలో కూడా ముందుంది మన నగరం.

పత్తర్‌గట్ : మదీనా సర్కిల్‌లో కొన్ని స్ట్రీట్‌ఫుడ్ అవుట్లెటు, రెస్ట్టరెంట్లు కూడా ఉన్నాయి. టీ, బిస్కెట్లు వీధుల చుట్టూ తిరిగి అమ్మేవాళ్ళు ఇక్కడ సాధారణంగా కనిపిస్తారు.

ప్రగతి గల్లీ : ప్రగతి గల్లీ హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో గల వీధి. ఈ ప్రదేశం రుచికరమైన అ ల్పాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఉదయా న్నే వీధులలో తాజాగా తయారుచేసే ఇడ్లీలు, దోసె లు, ఉప్మా, మేడు వడ మొదలైన వాటి ఘుమఘుమలతో ఇక్కడి వారు మేల్కొంటారు.

గచ్చిబౌలి : రాత్రిపూట పనిచేసే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ ఫుడ్‌ట్రక్‌లు రాత్రంతా తమ సేవలను అందిస్తూనే ఉంటాయి. మేగీ నుంచి మోమోస్, ఫ్రైస్, ఫిష్ , చిప్స్ ఇలాంటివన్నీ దొరికే ప్రాంతం.

సింధీ కాలనీ: బేగంపేట్‌లోని సింధికాలనీ కూడా స్ట్రీట్‌ఫుడ్‌కు పెట్టిందిపేరు. వడాపావ్, పిజ్జా, పాన్ నుంచి సోడా వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. భారతీయ మసాల టచ్‌తో మొదలై చైనీస్, మెక్సిక న్, ఇటాలియన్, పంజాబీ వంటి రుచికరమైన వం టకాలను వెరైటీ రుచులతో ఇక్కడ అందిస్తారు.

గ్యాన్ బాగ్ కాలనీ: హైదరాబాద్‌లో గ్యాన్ బాగ్ కాలనీలో హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధిచెందిన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. లక్ష్మణ్‌కి బండి గొప్ప ఆ హారం అందించే అవుట్లెట్లలో ఒకటి. మెల్టిం గ్ బట్టర్ ఇడ్లీలు ఇక్కడ ప్రసిద్ధి.

కోఠి: కోఠి భోజనప్రియులకు ప్రసిద్ధిచెందిన మరొక ప్రదేశం. ఇక్కడ మొజంజాహీ మార్కె ట్‌లో రుచికరమైన ఛాట్, స్ట్రీట్ ఫుడ్ లభిస్తుం ది. గోకుల్ ఛాట్ ఎప్పుడూ బిజీగా వుండే ప్రాంతం. ఇది ఉత్తమ అవుట్లెట్లలో ఒకటి.

మాదాపూర్: హైటెక్ సిటీలో సైబర్‌టవర్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రాత్రంతా ఇక్కడ ఆహారం దొరుకుతుంది. అందుకోసం ఫుడ్ ట్రక్‌లు కొలువుదీరుతాయి. రైస్, మొమోస్, పిజ్జ, దోసె, ఘీ ఇడ్లీ, ఫలూ దా, ఐస్‌క్రీం, కు ల్ఫీ..ఇలా ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటుంది. కొండాపూర్‌లో కబాబ్ సెంటర్‌లో గలౌటి కబాబ్‌లు ఫేమస్.

Best Pani Puri Stalls Or Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పానీపూరీ అడ్డా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.