ప్రెగ్గీబడ్డీకి ఎన్నెన్నో పురస్కారాలు

PregBuddy App

 

శివరీనా సరీక ఇప్పుడీ పేరు అందరికీ సుపరిచితమే. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ప్రెగ్గీబడ్డీ యాప్‌ను అభివృద్ధి చేసింది. గర్భిణులకు, పిల్లల పెంపకానికి కావాల్సిన సమాచారం ఈ యాప్ ద్వారా లభిస్తుంది. ఈ యాప్ తయారీకి శివరీనా ఎంతో కష్టపడింది. కొన్ని నెలలపాటు ఎందరో గర్భిణులు, తల్లులతో మాట్లాడింది. ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ యాప్ తయారుచేయడం వల్ల మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కొన్ని రోజుల తరువాత యాపిల్ సంస్థ మహిళా స్టార్టప్‌లను ప్రత్యేకంగా ప్రోత్సహించింది. అందులో భాగంగా ఈ యాప్‌నకు చేయూతనందించింది.

ప్రెగ్గీబడ్డీకి ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వచ్చాయి.యాప్‌లో నిపుణులు సందేహాలకు సలహాలిస్తారు. గర్భిణి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి యాపిల్ వాచ్ ద్వారా అందుబాటులో ఉన్న ఏకైక మెటర్నల్ యాప్ ఇది. ఈ స్టార్టప్ ప్రారంభించిన ఏడాదిలోనే దీనికి మంచి స్పందన వచ్చింది. అప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల మంది దీన్ని వినియోగించడం మొదలుపెట్టారు.

Best app for pregnant women
 Best app for pregnant women

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రెగ్గీబడ్డీకి ఎన్నెన్నో పురస్కారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.