బెంగాలీ కవి నిరేంద్రనాథ్ కన్నుమూత

కోల్ కతా :  ప్రసిద్ధ బెంగాలీ కవి నిరేంద్రనాథ్‌ చక్రవర్తి మంగళవారం కన్నమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. నిరేంద్రనాథ్‌ కవిత్వంతో పాటు కథానికలు, నవలలు కూడా రాశారు. ఉలోంగో రాజా (దిగంబర రాజు) కవితా సంపుటి ఆయనకు మంచి పేరు తెచ్చింది. నిరేంద్రనాథ్‌ చక్రవర్తి మృతిపై పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ, పలువురు సాహితీప్రియులు, రాజకీయవేత్తలు […]

కోల్ కతా :  ప్రసిద్ధ బెంగాలీ కవి నిరేంద్రనాథ్‌ చక్రవర్తి మంగళవారం కన్నమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. నిరేంద్రనాథ్‌ కవిత్వంతో పాటు కథానికలు, నవలలు కూడా రాశారు. ఉలోంగో రాజా (దిగంబర రాజు) కవితా సంపుటి ఆయనకు మంచి పేరు తెచ్చింది. నిరేంద్రనాథ్‌ చక్రవర్తి మృతిపై పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ, పలువురు సాహితీప్రియులు, రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

Bengali Poet Nirendranath Passed Away

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: