చర్మానికి దివ్యౌషధం ముల్తానీ మట్టి

  బయటకు అడుగుపెడితే చాలు కాలుష్యం కోరల్లో మన చర్మం విలవిల్లాడిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మచ్చలు, రంగుమారడం, మొటిమల్లాంటివి రావడం లాంటివి చాలా మంది సమస్య. ఈ సమస్య నివారణ కోసం పెద్ద పెద్ద బ్యూటీపార్లర్‌కి వెళ్లే సమయం కూడా ఉండని రోజులివి. మరి ఇంట్లోనే చర్మాన్ని శుభ్రపరుచుకోవడంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేది ముల్తానీ మట్టి. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. రోమన్ కాలం నుంచీ ముల్తానీ మట్టిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. […] The post చర్మానికి దివ్యౌషధం ముల్తానీ మట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బయటకు అడుగుపెడితే చాలు కాలుష్యం కోరల్లో మన చర్మం విలవిల్లాడిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మచ్చలు, రంగుమారడం, మొటిమల్లాంటివి రావడం లాంటివి చాలా మంది సమస్య. ఈ సమస్య నివారణ కోసం పెద్ద పెద్ద బ్యూటీపార్లర్‌కి వెళ్లే సమయం కూడా ఉండని రోజులివి. మరి ఇంట్లోనే చర్మాన్ని శుభ్రపరుచుకోవడంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేది ముల్తానీ మట్టి. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. రోమన్ కాలం నుంచీ ముల్తానీ మట్టిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. చర్మంలోని మలినాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలు, ముఖంపై ప్యాచ్‌లను తొలగించడంలో దివౌషధం ముల్తానీమట్టి.

సాధారణంగా మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడతారని మనందరికీ తెలుసు. ముల్తానీ మట్టి అనేది కొత్తదేమీ కాదు. పాత సౌందర్యసాధనమే. సహజమైన ఫేస్ ప్యాక్ కావటం వల్ల ముల్తానీ మట్టి వల్ల ఉపయోగాలు చాలా వున్నాయి. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు (పెరుగు, క్రీమ్, నిమ్మరసం, రోజ్ వాటర్) కలిపి చికిత్స తీసుకోవాలి. దీనివల్ల, చర్మం రంగు మెరుగుపడుతుంది. జిడ్డు సమస్య అదుపులో ఉంటుంది. ముడతలు మాయమవుతాయి.

క్లెన్సర్: ముల్తానీ మట్టిలో అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. మెగ్నీషియం క్లోరైడ్‌లో మొటిమలను నివారించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతే కాదు, మెగ్నీషియం క్లోరైడ్‌లో చర్మం రంధ్రాల్లోని మొత్తం బ్యాక్టీరియాను, దుమ్ము, ధూళిని తొలగించి మంచి క్లెన్సర్ గా సహాయపడుతుంది.

జిడ్డు చర్మం ఉంటే: చెంచా ముల్తానీమట్టి, పావుచెంచా నిమ్మరసం, అరచెంచా తేనె, పావుచెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది. చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాక్షన్ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్‌వాటర్‌తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. పది, పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.

స్క్రబ్బర్: ముల్తానీ మట్టి ఎక్స్ ఫ్లోయేట్ లేదా స్క్రబ్బర్ గా ఉపయోగించవచ్చు. స్క్రబ్బర్ గా ఇది ముఖం, ముక్కుమీద ఉన్న బ్లాక్ , వైట్ హెడ్స్ ను నివారిస్తుంది. ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్‌లలో విరివిగా ఉపయోగించవచ్చు. డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగించడానికి ఫేస్‌ప్యాక్ లలో ఉపయోగించవచ్చు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ముల్తానీ మట్టిలో స్క్రబ్, ఫేస్ ప్యాక్స్, క్లెన్సర్ బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మానికి తగినంత తేను అందిస్తుంది.

కమిలిన చర్మానికి స్వాంతన సూర్యరశ్మి కారణంగా కమిలిన చర్మానికి ఈ మట్టిని తరచూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముల్తానీ మట్టితో తయారుచేసిన అనేక యాంటీ టాన్ సోప్స్, ఫేస్ వాష్‌లు, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ముఖచర్మం రంగు తేలేందుకు కూడా ముల్తానీ మట్టి పని చేస్తుంది. 2 పెద్ద చెంచాల ముల్తానీ మట్టిలో అంతే పన్నీరు, 1/4 చిన్న చెంచా గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10 నిముషాలు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వాడుకుంటే, నల్లని చర్మంలో చాలా వరకూ మార్పు కలుగుతుంది.

చర్మం నిర్మాణం ముల్తానీ మట్టి చర్మం నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అసాధారణమైన ప్యాచ్‌లను నిర్మూలిస్తుంది. చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. స్కిన్ టోన్, టెక్చర్ కోసం ముల్తానీ మట్టిని క్రమంతప్పకుండా ఉపయోగించవచ్చు. దీన్ని అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగించవచ్చు. పొడి చర్మం, నిర్జీవమైన చర్మతత్వం కలిగిన వారు చలికాలంలో ముల్తానీ మట్టిని వాడకపోవడమే ఉత్తమం.

1. ముల్తానీ మట్టి సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. జిడ్డును తొలగించి స్కిన్ ఆయిలీగా కనిపించ కుండా చేస్తుంది. చర్మానికి కాంతినిచ్చి, మృదు వుగా మారుస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిలో రోజ్ కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. కళ్లు, పెదాల దగ్గర అంటకుండా జాగ్రత్తపడాలి.
2. తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రోజూ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి. దీంతో చర్మం సున్నితంగా మారుతుంది. ఈ మిశ్రమంలో గుడ్డు తెల్లసొన కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు.
3. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చర్మం మీది మృతకణాలను స్క్రబింగ్ ద్వారా తొలగించుకోవాలి. దాంతో చర్మం తాజాగా మారుతుంది.
4. బాదం గింజల పొడిలో కొద్దిగా యోగర్ట్, చిటికెడు పసుపు వేసి ప్యాక్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖం మీద వలయాకారంలో రాసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Benefits with Multani Mitti to Face and Skin

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చర్మానికి దివ్యౌషధం ముల్తానీ మట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.