వేడి నీళ్లు ఎక్కువగా తాగండి

చల్లటి వస్తువులకు దూరంగా ఉంటూ సి విటమిన్ ఎక్కువగా తీసుకోండి, కరోనా నివారణకు నిపుణుల సూచనలు హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ నియంత్రణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని చెబుతున్నారు. వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి […] The post వేడి నీళ్లు ఎక్కువగా తాగండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
చల్లటి వస్తువులకు దూరంగా ఉంటూ సి విటమిన్ ఎక్కువగా తీసుకోండి, కరోనా నివారణకు నిపుణుల సూచనలు

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ నియంత్రణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని చెబుతున్నారు. వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి వేడి టీ, కాఫీలు తాగాలని పేర్కొంటున్నారు. అందరూ తమ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్ సి, సిట్రస్ ఎక్కువగా ఉండే పళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకి వెళ్లినప్పుడు మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు గేటు హ్యాండిల్ గానీ, డోర్ హ్యాండిల్ గానీ పట్టుకోవద్దని, నేరుగా వాష్‌రూంకు వెళ్లి బట్టలు విప్పి సోప్ లేదా డిటర్జెంట్‌లో వేసి, తలస్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లటి వస్తువులు ఏమీ తీసుకోవద్దని సూచించారు.

అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. రోజులో చాలా సార్లు సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటున్నారు. మీ ముఖాన్ని చేతులతో తాకవద్దు, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ ముఖానికి మో చేతులు అడ్డం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఇతరులతో కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలని చెబుతున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Benefits Of Drinking Hot Water

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేడి నీళ్లు ఎక్కువగా తాగండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: