ఇద్దరూ ఇద్దరే!

Karthikeyaటాలీవుడ్‌లో హీరోగా ఆరేళ్ల క్రితం నటనలో ప్రవేశించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆరు సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అల్లుడు శీను, జయ జానకి నాయక సినిమాలు హిట్ అయినట్లు చెప్పుకోవచ్చు. మాస్ సినిమాల్లో నటిస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త కథలలో నటించాలని సీత సినిమాలో నటించాడు. అది కూడా నిరాశ పరచటంతో తమిళంలో హిట్టైన ‘రాట్చసన్ ’ సినిమా రీమేక్ కథను నమ్ముకున్నాడు. రాట్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కథ, కథనం అద్భుతంగా ఉండటం, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పాత్రకు తగినట్లుగా నటించటం సినిమాను హిట్ చేసాయి.

ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలై ఇద్దరికీ హిట్లు రావటం విశేషం. తమ సినిమా విజయవంతమైనందుకు ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముందు చేయబోయే సినిమాల్లో కథ, కథనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.

కార్తికేయ:

‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి RX 100 సినిమాతో హిట్ కొట్టాడు. కేవలం కోటిన్నర బడ్జెట్ తో తీసిన RX 100 సినిమా 13 కోట్ల రుపాయల వసూళ్ళు సాధించింది. కానీ ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా హిప్పీ సినిమాతో పోగొట్టు కున్నాడని సినీ విమర్శకులు అంటున్నారు. ఈ మధ్యనే విడుదలైన ‘గుణ 369’ సినిమాతో హిట్ కొట్టాడు కార్తికేయ.

bellamkonda srinivas and kartikeya movies

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇద్దరూ ఇద్దరే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.