అందమంటే రంగు కాదు

Beauty

 

ఏటా నిర్వహించే అందాల పోటీలు మిస్ యూనివర్స్ 2019కిగాను విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది సౌతాఫ్రికా నల్లకలువ జోజిబినీ తున్జీ.

అందానికి నిర్వచనం శరీరపు రంగు కాదని, ఆత్మ విశ్వాసం కూడా అని నిరూపించింది. 26 ఏళ్ల మిస్ సౌతాఫ్రికా జోజిబినీ తున్జీ త్సోలో ప్రాంతానికి చెందినది. దక్షిణాఫ్రికాలో నెలకొన్న జాతి వివక్షపై పోరాడిన మహిళల్లో తున్జీ ఒకరు. సోషల్ మీడియా వేదికగా జాతి వివక్షతను ప్రశ్నించడమే కాకుండా పెద్ద ఎత్తున్న అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహిళలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలానే ఉండాలని చెబుతోంది. ‘ నేటి బాలికలకు అత్యంత ప్రాధాన్యమైన అంశాన్ని నేర్పించాలంటే ఏమి నేర్పుతారనే జడ్జీల ప్రశ్నకు సమాధానంగా… “నేటి బాలికలకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలన్న” తున్జీ సమాధానమే ఆమె గెలుపునకు కారణమైంది. ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు.

స్కూల్ చదువు అయ్యాక, కేప్ పెనిన్సులా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి పబ్లిక్ రిలేషన్స్, ఇమేజ్ మేనేజ్‌మెంట్‌లో 2018లో డిగ్రీ చేసింది. కొన్నాళ్లు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసింది. మిస్ యూనివర్స్ కాకముందు తుంజీ మిస్ సౌత్ ఆఫ్రికా 2019 టైటిల్ గెలుచుకుంది.

విశ్వ సుందరి కిరీటం గెలుచుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ “అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచంలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నాను. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి” అంటూ తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపింది.

Beauty is not color

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అందమంటే రంగు కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.