ముఖంపై మచ్చలు పోవాలంటే..!

  అందానికి చర్మకాంతి తోడైతే… ఆ అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు లేకపోయినా కొందరి చర్మం రఫ్‌గా, కాంతిహీనంగా కనిపిస్తుంది. ఎన్ని క్రీములు వాడినా ఆ మెరుపు తాత్కాలికంగా నిలుస్తుంది. అలాంటి వారు ఈ చిట్కాని పాటిస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావలిసినవి: శనగపిండి రెండు టీ స్పూన్లు, గంధపుపొడి 1 టీ స్పూన్, పసుపు అరటీస్పూన్, కర్పూరం చిటికెడు, పాలు/ రోజ్‌వాటర్ కొద్దిగా. […]

 

అందానికి చర్మకాంతి తోడైతే… ఆ అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు లేకపోయినా కొందరి చర్మం రఫ్‌గా, కాంతిహీనంగా కనిపిస్తుంది. ఎన్ని క్రీములు వాడినా ఆ మెరుపు తాత్కాలికంగా నిలుస్తుంది. అలాంటి వారు ఈ చిట్కాని పాటిస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

కావలిసినవి: శనగపిండి రెండు టీ స్పూన్లు, గంధపుపొడి 1 టీ స్పూన్, పసుపు అరటీస్పూన్, కర్పూరం చిటికెడు, పాలు/ రోజ్‌వాటర్ కొద్దిగా.

తయారీ: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, గంధపుపొడి, పసుపు, కర్పూరం వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమంలో పాలు లేదా రోజ్‌వాటర్ బాగా కలుపుకోవాలి. చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని 20నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Beautiful skin with Nuts flour

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: