మామ, అల్లుడి మధ్య అందమైన అనుబంధం

relationship

 

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన వస్తోంది. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది ఈ సాంగ్.

ఈ పాట మామ, అల్లుడి మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరాః ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్‌ః ప్రవీణ్ పూడి.

Beautiful relationship between uncle and son-in-law

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మామ, అల్లుడి మధ్య అందమైన అనుబంధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.