బావిలో పడి గుడ్డేలుగు మృతి

 

మన తెలంగాణ/తిమ్మాపూర్: వనం నుంచి జనంలోకి వచ్చిన ఓ గుడ్డేలుగు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన కళ్లెం అనంతరెడ్డి వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తూ జారిపడి ఎలుగుబంటి చనిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటి కళేబరాన్ని బయటకు తీశారు. ఎలుగుబంటి కళేబరాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు.

 

Bear Dead after fell into Well in Karimnagar

The post బావిలో పడి గుడ్డేలుగు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.