మోసపూరిత ఆఫర్లను గమనించాలి

కొత్తగా జాబ్‌లకు అప్లై చేసుకునేవారికి ఆఫర్ లెటర్లు వస్తూంటాయి. ఒక్కొక్కసారి అసలు సంబంధంలేని జాబ్‌లకు కూడా ఆఫర్ లెటర్లు వస్తుంటాయి. అవి నిజమనుకుని సంప్రదిస్తే మోస పోయినట్టే. ఇలాంటి ఫేక్ ఆఫర్లను ఎలా కనిపెట్టాలో గమనించండి… * ఎక్కువ స్పెల్లింగ్ నుంచి వ్యాకరణ తప్పిదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాక్యాలు అర్థవంతంగా ఉండవు. ఇలా అయితే వాటిని ఫేక్ ఆఫర్‌లుగా గుర్తించాలి. * డబ్బులు అడిగారంటే అది ఫేక్ కాల్ అని చెప్పుకోవచ్చు. బాధ్యతాయుతంగా ఉండే కంపెనీలు […]

కొత్తగా జాబ్‌లకు అప్లై చేసుకునేవారికి ఆఫర్ లెటర్లు వస్తూంటాయి. ఒక్కొక్కసారి అసలు సంబంధంలేని జాబ్‌లకు కూడా ఆఫర్ లెటర్లు వస్తుంటాయి. అవి నిజమనుకుని సంప్రదిస్తే మోస పోయినట్టే. ఇలాంటి ఫేక్ ఆఫర్లను ఎలా కనిపెట్టాలో గమనించండి…
* ఎక్కువ స్పెల్లింగ్ నుంచి వ్యాకరణ తప్పిదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాక్యాలు అర్థవంతంగా ఉండవు. ఇలా అయితే వాటిని ఫేక్ ఆఫర్‌లుగా గుర్తించాలి.
* డబ్బులు అడిగారంటే అది ఫేక్ కాల్ అని చెప్పుకోవచ్చు. బాధ్యతాయుతంగా ఉండే కంపెనీలు ఏవీ డబ్బులు అడగవు. ఆఫర్‌కు ముందే బాండ్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఇబ్బంది పెట్టవు.
* మోసపూరితమైన ఈ మెయిళ్ళలో జాబ్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఉండదు. కంపెనీ, ప్యాకేజ్, జాబ్‌లో భాగంగా నిర్వర్తించాల్సిన పాత్ర, విధులు వంటి వివరాలు ఏమీ ఉండవు. అస్పష్టత, అంతకుమించి సందిగ్ధత కనిపిస్తుంది.
* స్థాయుల్లో పైనించి కిందికి జాబ్ ఏదైనప్పటికీ సంబంధిత సమాచారం ఎక్కువమంది అందుబాటులో ఉండేందుకు కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. అర్హులను ఎంపిక చేసుకునేందుకు వీలుగా వివిధ రూపాల్లో జాబ్ సమాచారాన్ని తెలియజేస్తాయి. రిఫరల్, యాడ్స్ తదితరాలు అన్నమాట.
* తప్పుడు ఆఫర్లకు సంబంధించిన ఈ మెయిళ్ళన్నీ సాధారణంగా స్పామ్ ఫోల్డర్‌లోకి చేరుతుంటాయి. వీటిని ఒకేసారి పెద్దఎత్తున పంపడంతో అందులోకి చేరతాయి. నిజమైన ఆఫర్లు ఎప్పుడు వేల సంఖ్యలో బల్క్‌గా పంపరు.
* ఫేక్ ఆఫర్లు పంపే కంపెనీలు చాలా వరకు పేరున్న కంపెనీల పేర్లను, లోగోలను కాపీ కొడతాయి. ఒకటి రెండు అక్షరాల తేడాతో తప్పుదోవ పట్టిస్తాయి. సూక్ష్మంగా చూస్తే తప్ప ఈ తేడాను అర్థం చేసుకోలేం.
* ఇంటర్నెట్ విజృంభణతో సమస్త పనులూ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని, ఆఫర్లను అందుకోవడం కూడా మెయిల్స్ ద్వారానే జరుగుతోంది. ఇదే అదనుగా కొంతమంది తప్పుడు ఆఫర్లను పంపి అభ్యర్థులను మోసం చేస్తున్నారు. అలాంటి ఫేక్ ఆఫర్లను ఎలా గుర్తించాలో చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు.
* తప్పుదారి పట్టించేదిగా అనిపించినా, అనిపించకున్నా సదరు కంపెనీకి సంబంధించిన వివరాలు, అందులో అసలు అలాంటి ఉద్యోగాలు ఉన్నాయా లేదా అనే విషయాల కోసం నెట్‌లో పరిశోధన చేయడం ఉత్తమం. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి.
* మెయిలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలియని విధంగా ఆఫర్లు ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేరు. ఉదాహరణకు ‘@abc.-com’ ఇలా ఉంటాయి. జీమెయిల్, యాహూ మెయిల్, హాట్‌మెయిల్ నుంచి జాబ్ ఆఫర్లను కంపెనీలు పంపవు. టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్… ఇలా కంపెనీ ఐడినే వాడతారు.
* పుట్టిన రోజు, సోషల్ సెక్యూరిటీ నెంబరు, ఇతర వ్యక్తిగత వివరాలు అడిగిన పక్షంలో ఆ ఆఫర్‌ను నమ్మడానికి వీల్లేదు. వీటిలో కొన్ని అడిగినప్పటికీ రెండో దశలో ఉంటుంది. ఒక స్థాయిలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల నేపథ్యం తెలుసుకునేందుకు కొంతమేర వ్యక్తిగత సమాచారం అడుగుతూ ఉంటారు.

Comments

comments

Related Stories: