దుబాయిలో ఐపిఎల్?

ముంబై: కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను దుబాయిలో నిర్వహించాలనే యోచనలో భారత క్రికెట్ బోర్డు ఉన్నట్టు సమాచారం. దీనిపై శుక్రవారం జరిగే బిసిసిఐ ప్రతినిధుల సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఐపిఎల్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో దుబాయిలో ఐపిఎల్‌ను నిర్వహించడమే మంచిదని బిసిసిఐతో పాటు ఫ్రాంచైజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే యుఎఇ క్రికెట్ బోర్డుతో కూడా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఇరు దేశాల బోర్డుల మధ్య టోర్నీ నిర్వహణకు సంబంధించి ఓ అవగాహన కుదిరిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతోపాటు టీమిండియా కాంట్రాక్టు క్రికెటర్లకు కూడా దుబాయిలోనే శిక్షణ శిబిరాన్ని నిర్వహించాలనే యోచనలో కూడా బిసిసిఐ ఉన్నట్టు తెలిసింది.

BCCI to planning to hold IPL in Dubai

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దుబాయిలో ఐపిఎల్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.