విండీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక

ముంబయి: విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆదివారం బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి విండీస్ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ మూడు ఫార్మాట్లకు మూడు జట్లను బిసిసిఐ ప్రకటించింది. ఈ టూర్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, హర్దిక్ పాండ్యాలకు బిసిసిఐ విశ్రాంతినిచ్చింది.  గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్‌ వన్డే, టీ20 రెండు ఫార్మాట్లకు ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారీకి చోటు దక్కింది.
టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనిష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, యజువేంద్ర ఛాహల్, కేదార్ జాదవ్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ.
టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, సి. పుజారా, హనుమ విహారీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.
BCCI selected Team India for West Indies tour

The post విండీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.