23నుంచి బతుకమ్మ చీరలు

Bathukamma sarees

1.02 కోట్ల మంది మహిళలకు చీరలు .. రూ.313 కోట్ల ఖర్చుతో 100
వెరైటీల్లో చీరలు …వచ్చే సంవత్సరం కల్లా బతుకమ్మ చీరలకు బ్రాండింగ్
రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న చిరుకానుక బతుకమ్మ చీరలు అని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బ తుకమ్మ పండుగకు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు చీరను అంది ంచాలన్న లక్షంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 23 నుంచి ప్రారంభించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆ రోజున ప్ర తి నియోజకవర్గ కేంద్రంలో చీరల పంపిణీ ని శాసనసభ్యులు, శానమండలి సభ్యులు, ఎంపిలు, జడ్‌పి చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారని వెల్లడించారు. గురువారం మసాబ్ ట్యాంక్‌లోని సిడిఎంఎ కార్యాలయంలో ఐ టి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రం జన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యా ర్, సిడిఎంఎడైరెక్టర్ శ్రీదేవి, సెర్ప్ సిఇవో పౌసమిబ సు, టెస్కో జిఎం యాదగిరి తదితరులతో కలిసి ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌బతుకమ్మ చీరల పంపిణి వివరాలను వెల్లడించారు. ద్విముఖ వ్యూహంతో బతుక మ్మ చీరల పథకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలందరు చీరలను అందచేస్తామన్నారు. 1.02కోట్ల మంది అర్హులైన మహిళ లు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కో ట్లు వెచ్చించిందన్నారు. రాష్ట్రంలో మహిళలందరు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశం తో సిఎం మూడు సంవత్సరాలుగా బతుక మ్మ చీరలను అందిస్తున్నారని అన్నారు. పవర్ లూం కార్మికులకు ఉపాధి బతుకమ్మ చీరల ద్వారా 16వేల కు టుంబాలకు ప్రత్యక్ష్యంగా ఉపాధి దొరికిందన్నా రు. 26వేల మరమగ్గాల ద్వారా చీరలను తయారు చేశామన్నారు. ఈ సంవత్సరం 10 రకాల డిజైన్‌లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచామన్నారు. చీరలు జిల్లాలకు చేరవేశామన్నారు. బతుకమ్మ చీరల ద్వారా మరమగ్గ కార్మికులకు గతంలో నెలకు రూ.8 నుంచి 12వేల రూపాయలు మాత్రం దక్కేదని కానీ బతుకమ్మ చీరల తయారీ తరువాత నెలకు రూ.16 వేల నుంచి రూ. -20వేల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. బతుకమ్మ చీరల కోసం గత మూడు సంవత్సరాల్లో రూ.715కోట్లు కేటాయించిందని తెలిపారు. చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా చీరల పంపిణి చేస్తున్నామని, ప్రతి సంవత్సరం డిజైన్‌లు, నాణ్యతలో మరింత మెరుగుగా ఉండే విధంగా చీరల తయారి చేయిస్తున్నామన్నారు. చీరతో పాటుగా జాకెట్ కూడా అందించనున్నట్లుగా తెలిపారు.

Bathukamma sarees to be distributed from Sep 23

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 23నుంచి బతుకమ్మ చీరలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.