పేదలకు కల్పతరవు.. బస్తీ దవాఖానాలు

basti-dawakhanasరోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య
101 బస్తీ దవాఖానాల్లో వైద్యం కోసం అదనపు సిబ్బంది
200 రకాల వైద్యపరీక్షలు, 135 రకాల మందుల పంపిణీ
కార్పొరేట్ ఆసుపత్రులను మరిపించేలా చికిత్సలు
రోగుల సంఖ్య రోజురోజు ‘క్యూ’ పెరిగిపోవడంతో
అదనపు సిబ్బంది

నగరంలో పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీదవాఖానలకు ప్రజలను నుంచి మంచి స్పందన లభిస్తుంది. వేల రూపాయలు ఖర్చు పెట్టలేని సామాన్యులకు వరంగా మారిందని స్థ్దానికులు ప్రశంసిస్తున్నారు. విషజ్వరాలతో వచ్చే వారికి వైద్య సిబ్బంది పలు రకాలు సేవలతో సకాలంలో చికిత్సలు అందిస్తున్నారు. దీంతో నగరవాసులు బస్తీ దవాఖానకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత రెండు నెల నుంచి గ్రేటర్ నగరంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతూ పేదలను ఆసుపత్రుల బాట పట్టించాయి. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధు లతో ఫీవర్, ఉస్మానియా,గాంధీ ఆసుపత్రులో చికిత్సలు చేయించుకుంటున్నారు.

రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపో వడంతో ప్రభుత్వం పట్టణ బస్తీ దవాఖానలో అదనపు సిబ్బందిని నియమించి సేవలు ప్రారంభించారు. ప్రాథమిక దశలోనే గుర్తించి నాణ్యమైన వైద్యం అందించేందుకు కావాల్సిన సదుపాయాలు అందుబాటులో ఉంచారు. గ్రేటర్‌లో 101 బస్తీ దవాఖానాలు, 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 06 ఏరియా ఆసుపత్రులు, 03 జిల్లా ఆసుప త్రుల్లో ఉండగా,వాటిలో డెంగ్యూ, మలేరియా జ్వరాల బాధితులకు సిబ్బంది సెలవులు పెట్టకుండా విధులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతూ 200 రకాల వైద్య పరీక్షలు 135 రకాల మందులు అందజేస్తున్నారు.

హైదరాబాద్: బస్తీదవాఖా సేవలకు రోగులు మొగ్గు మహానగరంలో ప్రతి 5వేల నుంచి 10వేల జనాభాకు ఒక చొప్పన ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటివరకు దశలవారిగా 150బస్తీల్లో ఏర్పాటు ప్రణాళికలు సిద్దం చేసింది. ఒక్కో దవాఖానలకు రోజుకు 70నుంచి 150మంది వరకు సేవలకు వస్తుండగా, సంతోష్‌నగర్, బండ్లగూడ, కార్వాన్, రాజేంద్రనగర్, బిజేఆర్‌నగర్ వంటి బస్తీలో రోజుకు 220మందికిపైగా రోగులు చికిత్సల కోసం వస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు స్దానికంగా ఉండే దవాఖానలో ప్రతి జబ్బుకు ఉస్మానియా,గాంధీకి వెళ్లకుండా ఉండేందుకు 200 రకాల వైద్యపరీక్షలు, 135 రకాల మందుల పంపిణీ చేస్తూ ప్రైవేటు మెడికల్ దుకాణాల వైపు వెళ్లకుండా చేస్తున్నారు.

టెలీమెడిసిన్ సేవలు…

ఇప్పటికే 10 దవాఖానలో టెలీమెడిసిన్ ద్వారా పరీక్షలు నిర్వహస్తున్నారని, త్వరలో మరో 32 బస్తీదవాఖానలో చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.వీటికితోడు 96 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సాయంత్రం వేళ ప్రత్యేక క్లీనిక్‌లను నిర్వహించి వాటికి వివిధ ఆసుపత్రులకు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను రప్పిస్తున్నారు. బస్తీ దవాఖానలతో పాటు, పట్టణ ఆరోగ్య కేంద్రాలో పేదలు వైద్యపరీక్షలు చేయించేకునేందుకు ఆరోగ్య కార్యకర్తల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Basti Dawakhanas Best Facilities for Patients

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పేదలకు కల్పతరవు.. బస్తీ దవాఖానాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.