ప్రజల ఆరోగ్యానికి బస్తీ దవాఖానలు భరోసా

Basti Dawakhana Inaugurated by Minister

 

నగరంలో 168 దవాఖానల్లో పేదలకు వైద్య సేవలు
రోజుకు 15 వేలమందికి నాణ్యమైన చికిత్సలు
మూడు నెలల్లో మరో 132 దవాఖానలకు ఏర్పాట్లు
కార్పొరేట్ ఆసుపత్రులు కనుమరుగే ప్రారంభోత్సవంలో మంత్రులు

మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులో తీసుకొచ్చింది. 50వేల జనాభా చొప్పన ఒక దవాఖాన ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2018 ఏప్రిల్ 6న మల్కాజిగిరి బిజేఆర్ నగర్‌లో ప్రారంభమైన దవాఖానలు గత రెండేళ్ల కాలంలో 123 దవాఖానల ద్వారా 10వేలు మందికి రోజు వైద్య సేవలు అందుతుండటగా తాజాగా మరో 45 బస్తీదవాఖానలతో మరో 5 వేలమంది ప్రజలు వైద్యం చేయించుకునేందుకు శుక్రవారం మంత్రులు ఘనంగా ప్రారంభించి కార్పొరేట్ ఆసుపత్రులకే దీటుగా వైద్య సదుపాయం అందిస్తామని సీజనల్ వస్తే సులువగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి స్వరాష్ట్ర ఏర్పటిన నాటినుంచి నగరంలో వైద్య సేవలకు ఢోకాలేదని వెల్లడించారు. ఒక దవాఖానాలో ఒక వైద్యుడు, నర్సు, ఒక సహాయకుడు ఉండి వైద్య చికిత్సలు అందజేస్తారని జిల్లా వైద్యధికారులు వెల్లడిస్తున్నారు.

హైదరాబాద్ జిల్లాలో 22, మేడ్చల్ మల్కాజిగిరి 15, రంగారెడ్డి 05, సంగారెడ్డి 03 బస్తీ దవాఖానల్లో సేవలు ప్రారంభమైయ్యాయి. ఇప్పటివరకు 168 దవఖానలు అందుబాటులోకి రాగా మూడు నెలల్లో మరో 132 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి 300 దవాఖానల ద్వారా నిత్యం వేలాది మందికి నాణ్యమైన వైద్యం అందిస్తాయని మంత్రులు వెల్లడించారు. రెండు వారాల కితం జిల్లా వైద్యాధికారులు కాంట్రాక్టు పద్దతిన 94 వైద్యాధికారులు, 58మంది సాప్ట్‌నర్సుల నియమించారు. వీటిలో త్రీడీ ఫార్ములా సేవలందిస్తున్నారు. బస్తీ దవాఖానలు ఉచిత వైద్య సేవలు ఉంటాయని, అందులో ఓపి కన్సల్టేషన్, టెలీ కన్సల్టేషన్, బేసిక్ ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందులు, సాధారణ జ్వరానికి చికిత్స, వ్యాధి నిరోధక ఇమ్యునైజేషన్ సేవలు, గర్భిణీలు,బాలింతల సంరక్షణకు చర్యలు, కుటుంబ నియంత్రణలో కౌన్సిలింగ్, వైద్యసేవలు, రక్త హీనత పరీక్షలు, బిపి, బ్లడ్‌షుగర్,క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్లకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.

అదే విధంగా ప్రతి రోజు 80మంది ఔట్ పేషంట్ సేవలు, సాధారణ జ్వరాలకు రోజుకు 20మందికి, దగ్గు, జలుబు రోగులకు 10 నుంచి 20మందికి చికిత్సలు, చర్మ,ఒళ్లు నొప్పులు, ఇతర అనారోగ్యానికి రోజుకు 50మందికి సేవలు అందించనున్నారు. ప్రతి రోజు దాదాపు 40 మంది వివిధ రకాల ల్యాబ్ పరీక్షలు చేస్తామని బస్తీ దవాఖానల వైద్యులు చెబుతున్నారు. మహానగరం ప్రజలు ఇప్పటినుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వెళ్లాల్సిన అవసరంలేదని వాటికి మించిన వైద్యం అందించి ఆరోగ్య నగరంగా హైదరాబాద్‌కు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పేర్కొన్నారు.

 

 

The post ప్రజల ఆరోగ్యానికి బస్తీ దవాఖానలు భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.