23 నుంచి అత్యవసర సేవలు మాత్రమే

నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెల్లింపులు, చెక్కుల క్లియరింగ్‌లు, ప్రభుత్వ లావాదేవీలకే అవకాశం మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి : బ్యాంక్ వర్గాలు వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో మార్చి 23 నుంచి బ్యాంక్ బ్రాంచ్‌లలో అత్యవసర సేవలు మాత్రమే అందించనున్నామని ఆదివారం ఐబిఎ(ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) ప్రకటించింది. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెల్లింపులు, చెక్కుల క్లియరింగ్‌లు, ప్రభుత్వ లావాదేవీలు మాత్రమే బ్రాంచ్‌లలో ఉంటాయని పేర్కొం ది. అత్యవసరం కాని సేవలను […] The post 23 నుంచి అత్యవసర సేవలు మాత్రమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెల్లింపులు, చెక్కుల క్లియరింగ్‌లు, ప్రభుత్వ లావాదేవీలకే అవకాశం
మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి : బ్యాంక్ వర్గాలు వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో మార్చి 23 నుంచి బ్యాంక్ బ్రాంచ్‌లలో అత్యవసర సేవలు మాత్రమే అందించనున్నామని ఆదివారం ఐబిఎ(ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) ప్రకటించింది. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెల్లింపులు, చెక్కుల క్లియరింగ్‌లు, ప్రభుత్వ లావాదేవీలు మాత్రమే బ్రాంచ్‌లలో ఉంటాయని పేర్కొం ది. అత్యవసరం కాని సేవలను వినియోగదారులు తమ మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నిర్వహించుకోవాలని ఐబిఎ తెలిపింది. కస్టమర్లు అత్యవసరమైతేనే బ్రాంచ్‌ల వద్దకు రావాలని కూడా సంస్థ సూచించింది. వినియోగదారులు డిజిటల్ విధానాలను ఎక్కువగా వినియోగించుకోవాలని, బ్రాంచ్‌ల వద్దకు రావడాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పాటిస్తున్న బ్యాంకులు.. ఈ కాలంలో 50 శాతం మంది సిబ్బంది బ్రాంచ్‌లలో ఉండరని, అందువల్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని బ్యాం కింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బ్యాంక్ యూనియన్ల సమ్మె వాయిదా

రెండు ప్రధాన బ్యాంకింగ్‌రంగ సంఘాలు -ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబిఒఎ) మార్చి 27న నిర్వహించతలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నాయి. ఐడిబిఐ బ్యాంక్ విలీనం, ప్రైవేటీకరణకు నిరసనగా యూనియన్లు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో ప్రజలకు అండగా నిలిచేందుకు గాను సమ్మెను ఉపసంహరించుకున్నామని ఎఐబిఇఎ సెక్రటరీ జనరల్ సిహెచ్ వెంకటచలం అన్నారు. దీనికి ముందు బ్యాంక్ యూనియన్లు మార్చి 11 నుండి మూడు రోజుల సమ్మెను ఉపసంహరించుకున్నాయి. దీని తరువాత మార్చి 27న బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకుల్లో లాకౌట్ ప్రకటించాయి. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు అతిపెద్ద బ్యాంకుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు.

ఈ విలీనం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. విలీన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, సంబంధిత బ్యాంకులతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, రెగ్యులేటరీ సమస్య ఉండదని సీతారామన్ అన్నారు. ఏప్రిల్ 1న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కోఆపరేషన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల విలీనం అమలవుతుంది.

Banks to only have essential services from March 23

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 23 నుంచి అత్యవసర సేవలు మాత్రమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: