లైంగిక వేధింపుల కేసులో బ్యాంకు మేనేజర్ అరెస్టు

మిర్యాలగూడ: యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్‌పి వై. వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డిఎస్‌పి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలో నివాసముంటున్న నూనె వెంకటేశ్వర్లు గోదావరి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బ్యాంకులో ఉద్యోగాల కోసం డిసెంబర్ ౩1న ఓ పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారని డిఎస్‌పి తెలిపారు. జనవరి 6న […] The post లైంగిక వేధింపుల కేసులో బ్యాంకు మేనేజర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మిర్యాలగూడ: యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్‌పి వై. వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డిఎస్‌పి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలో నివాసముంటున్న నూనె వెంకటేశ్వర్లు గోదావరి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బ్యాంకులో ఉద్యోగాల కోసం డిసెంబర్ ౩1న ఓ పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారని డిఎస్‌పి తెలిపారు. జనవరి 6న వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారని, వారిలో కొంతమంది యువతుల ఫోన్ నెంబర్లను రెజ్యూమ్‌లో ఉంచగా పలుమార్లు వారికి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడని, వారితో వాట్సప్‌లు, ఫోన్లలో అసభ్యంగా మాట్లాడేవాడని డిఎస్‌పి పేర్కొన్నారు.

ఓ యువతిని ఈ నెల 7న రైల్వేస్టేషన్ వద్దకు రావాలని, అక్కడ ఏకాంతంగా కలుద్దామని చెప్పాడని, బాధితురాలిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని వెళ్లాడన్నారు. అక్కడ ఆమె చేయి పట్టుకొని లైంగికంగా వేధించాడని డిఎస్‌పి వెల్లడించారు. బాధితురాలి స్నేహితులు మేనేజర్‌ను పట్టుకొని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారని డిఎస్‌పి పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డిఎస్‌పి చెప్పారు. అతని వద్ద నుంచి ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ పచ్చిపాల పరమేశ్, కానిస్టేబుళ్లు జానయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bank Manager Arrested for Sexual Harassment Case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లైంగిక వేధింపుల కేసులో బ్యాంకు మేనేజర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: