పింక్‌బాల్ సమరంపై సర్వత్రా ఆసక్తి

  కోల్‌కతా: భారత గడ్డపై తొలిసారిగా జరుగనున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. టికెట్ల ధరలను కూడా భారీగా తగ్గించారు. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఇప్పటికే టికెట్లను సొంతం చేసుకున్నారు. మూడు రోజులకు సంబంధించి టికెట్లలన్నీ ఇప్పటికే అమ్ముడై […] The post పింక్‌బాల్ సమరంపై సర్వత్రా ఆసక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా: భారత గడ్డపై తొలిసారిగా జరుగనున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. టికెట్ల ధరలను కూడా భారీగా తగ్గించారు. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఇప్పటికే టికెట్లను సొంతం చేసుకున్నారు. మూడు రోజులకు సంబంధించి టికెట్లలన్నీ ఇప్పటికే అమ్ముడై పోయాయి. భారత్‌లో ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే క్రికెట్ పోటీలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఐపిఎల్ రాకతో ఈ ఆదరణ మరింత పెరిగింది. ఎన్నో నగరాల్లో ఇప్పటికే ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియాలను నిర్మించారు. దీంతో చాలా వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలు ఫ్లడ్ లైట్ల వెలుగులోనే జరుగుతున్నాయి.

అయితే భారత గడ్డపై ఇప్పటి వరకు డేనైట్ టెస్టు మ్యాచ్ జరుగలేదు. కానీ, ఈసారి ఆ లోటు తీరనుంది. శుక్రవారం ఈ సమరానికి తెరలేవనుంది. భారత్‌లోనే అతి పెద్ద స్టేడియంగా పేరు తెచ్చుకున్న ఈడెన్ గార్డెన్స్ ఈ చారిత్రక మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. వేలాది మంది అభిమానులతో స్టేడియం కిటకిటలాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ కోసం ముమ్మర సాధన చేస్తున్నారు. ఇందు కోసం పింక్ బాల్‌తో కఠోర సాధన చేశారు. ఇండోర్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన సమయాన్ని ఇరు జట్ల క్రికెటర్లు సాధనకే కేటాయించారు. ఇక, ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ క్రికెటర్లు కోల్‌కతా చేరుకున్నారు. చారిత్రక మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కతా మహా నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. ఎక్కడ చూసిన క్రికెట్‌కు సంబంధించిన చర్చనే జరుగుతోంది. దీన్ని బట్టి ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు.

కోల్‌కతా చేరిన బంగ్లా, భారత్ జట్లు
కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు మంగళవారం కోల్‌కతా చేరుకున్నాయి. ఇండోర్ నుంచి రెండు జట్ల క్రికెటర్లు కోల్‌కతా చేరారు. ఇక్కడి సుభాష్‌చంద్రబోస్ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కాగా, భారత గడ్డపై తొలిసారిగా కోల్‌కతా వేదికగా చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు జట్లు కూడా ఇప్పటి వరకు డేనైట్ మ్యాచ్‌లు ఆడలేదు. ఇరు జట్లకు ఇదే తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కానుంది. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించి జోరుమీదుంది. కోల్‌కతాలో జరిగే పింక్ బాల్ సమరంలో కూడా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.

కాగా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇండోర్‌లో రెండు రోజులపాటు పింక్‌బాల్‌తో ముమ్మర సాధన చేశారు. నీళ్లలో ముంచిన బంతితో బంగ్లా ఆటగాళ్ల సాధన కొనసాగింది. భారత క్రికెటర్లు కూడా ఇండోర్‌లోనే ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు కూడా పింక్ బంతితోనే సాధన చేశారు. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. బంగ్లాతో పోల్చితే భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్‌కు ఎదురేలేదు. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న విరాట్ కోహ్లి సేన కోల్‌కతాలోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో సాధన చేసే అవకాశం ఉంది.

కాగా, ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భారత్‌లో డేనైట్ మ్యాచ్‌లకు చాలా ఆదరణ లభిస్తోంది. ఐపిఎల్‌తో పాటు అంతర్జాతీయ వన్డే సిరీస్‌లు, టోర్నమెంట్‌లు ఈ ఫార్మాట్‌లోనే జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్‌లలో పరిమిత ఓవర్ల క్రికెట్ పోటీలు ఫ్లడ్ లైట్ల వెలుగులోనే జరుగడం అనవాయితీ. తాజాగా భారత గడ్డపై సంప్రదాయ టెస్టు మ్యాచ్ కూడా ఈ ఫార్మాట్‌లోనే జరుగనుంది. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Bangladesh and India teams joining to Kolkata

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పింక్‌బాల్ సమరంపై సర్వత్రా ఆసక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: