బంగ్లాదేశ్ ప్రధానిపై దాడి కేసులో 9మందికి మరణ శిక్ష

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 25 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు జరిగిన దాడికి సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ పబ్నా కోర్టు బుధవారం 9 మందికి మరణశిక్ష మిగతా 25 మందికి జీవిత ఖైదు విధించింది. ఆనాడు జాతీయస్థాయిలో ఆమె రైలులో ప్రచారం సాగిస్తుండగా 1994 సెప్టెంబర్ 23న ఆమె ప్రయాణిస్తున్న కోచ్ పబ్నాఇష్వర్డీ ప్రాంతానికి వచ్చేసరికి దాడి జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) ఛైర్‌పర్శన్ ఖలేదా జియా మొదటి సారి ప్రధానిగా […] The post బంగ్లాదేశ్ ప్రధానిపై దాడి కేసులో 9మందికి మరణ శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 25 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు జరిగిన దాడికి సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ పబ్నా కోర్టు బుధవారం 9 మందికి మరణశిక్ష మిగతా 25 మందికి జీవిత ఖైదు విధించింది. ఆనాడు జాతీయస్థాయిలో ఆమె రైలులో ప్రచారం సాగిస్తుండగా 1994 సెప్టెంబర్ 23న ఆమె ప్రయాణిస్తున్న కోచ్ పబ్నాఇష్వర్డీ ప్రాంతానికి వచ్చేసరికి దాడి జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) ఛైర్‌పర్శన్ ఖలేదా జియా మొదటి సారి ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ దాడిలో హసీనా ప్రాణాలతో బయటపడ్డారు. అడిషనల్ సెషన్స్ జడ్జి రొస్తోమ్ అలీ పదేళ్ల పాటు 13 మందికి జైలు శిక్ష విధించారు.

ఈ సంఘటనకు సంబంధించి మొదట 135 మందిపై కేసు దాఖలు చేశారు. 1996లో అవామీ లీగ్ అధికారం లోకి వచ్చిన తరువాతనే ఈ కేసు విచారణ ఊపందుకుంది. అంతకు ముందు బిఎన్‌పి పరిపాలనలో మందకొడిగా సాగింది. దర్యాప్తు పూర్తయ్యేసరికి పోలీసులు 52 మంది నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేశారు. కోర్టు తీర్పు వెలువడిన తరువాత స్థానిక బిఎన్‌పి నాయకులు కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. పాలక వర్గ అవామీ లీగ్ మద్దతు దారులుస సంతోషం తెలియచేస్తూ ఊరేగింపు నిర్వహించారు. బీజింగ్‌కు హసీనా అధికార పర్యటనకు వెళ్లినప్పుడు ఈ తీర్పు రావడం గమనార్హం.

Bangla sentences 9 Activists to death for attacking on PM

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బంగ్లాదేశ్ ప్రధానిపై దాడి కేసులో 9మందికి మరణ శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.