రోజుకొక పండు తింటే చాలు…!

  అరటిని ప్రపంచ ఫస్ట్ ఫ్రూట్‌గా కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లో అరటి సాగు జరుగుతుంది. ధన విలువలో ఆహార పంటల్లో అరటి నాలుగో స్థానంలో ఉంది. ఈ పండులో లెక్కలేనన్ని ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా దొరికే అరటి పండు పోషకాల పవర్ హెన్ అంటారు డైటీషియన్‌లు. చర్మానికీ, శిరోజాలకు అంతులేని మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే సి,బి6 చర్మం మృదువుగా చక్కని ఎలాస్టిక్ కలిగి ఉండేలా […] The post రోజుకొక పండు తింటే చాలు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అరటిని ప్రపంచ ఫస్ట్ ఫ్రూట్‌గా కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లో అరటి సాగు జరుగుతుంది. ధన విలువలో ఆహార పంటల్లో అరటి నాలుగో స్థానంలో ఉంది. ఈ పండులో లెక్కలేనన్ని ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా దొరికే అరటి పండు పోషకాల పవర్ హెన్ అంటారు డైటీషియన్‌లు. చర్మానికీ, శిరోజాలకు అంతులేని మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే సి,బి6 చర్మం మృదువుగా చక్కని ఎలాస్టిక్ కలిగి ఉండేలా సహకరిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వార్ధక్య భయాలు రానివ్వకుండా చర్మాన్ని కాపాడతాయి. ఏ సీజన్‌లోనూ పొడిబార నివ్వదు. మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. పండులోని విటమిన్‌ఎ చర్మం కోల్పోయిన తేమ తిరిగి పొందేందుకు సహకరిస్తుంది. పండిన అరటిపండు చిదిమి, ముఖానికి,మెడకు పట్టించి పదినిమిషాలు అలా వదిలేస్తే చర్మానికి తగిన తేమ అంది చర్మం మెరుపుతో ఉంటుంది.

పిగ్మెంటేషన్ సమస్యకు అరటి పండు గొప్ప మందు.

అరటిపండు గుజ్జులో స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్‌చేస్తే చర్మానికి మాయిశ్చరైజర్ లభించి ముఖం మెరుస్తుంది. అరటిపండు గుజ్జు, తేనె, బాదం పప్పుల పొడి కలిపిన పేస్ట్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. అరటిపండులో బెల్లం కలపి ముఖం,మెడ స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు రోజుకో పండు తింటే ఆస్తమా పెరిగే అవకాశం 34శాతం తక్కువగా ఉంటుంది. అరటిపండులో ఫైబర్, పొటాషియం, విటమిన్‌సి, బి6లు గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి. డయాబెటిక్ రోగులు మధ్యస్తంగా ఉన్న ఒక అరటిపండు తింటే మూడుగ్రాముల పీచు శరీరానికి లభిస్తుంది. ఇన్సులిన్ స్థాయి మెరగవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో అరటిపండు తింటే విద్యార్ధులు మరింత బ్రెయిన్ పవర్‌తో ఉంటారు. మూడ్‌ను క్రమబద్ధీకరించే ట్రెఫ్టోఫిన్ అనే పదార్థాన్ని అరటిపండ్లు విడుదల చేస్తాయి. దీని వల్ల సంతోషం ఆనందం కలుగుతాయి.

స్మోకింగ్ మానేయాలంటే అరటిపండు తీసుకోమంటున్నారు నిపుణులు. అరటిపండులో ఉండే బి విటమిన్లు ఇతర ఖనిజాలు నికోటిన్ మానేయగల ప్రభావాన్ని శారీరకంగా మానసికంగా కూడా కల్పిస్తాయి. అరటిపండులో ఐరన్ అధికం. అరటిపండే కాదు పచ్చి అరటి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి అరటి సరైన ఆహారం. మెటబాలిజం బూస్టర్లగా పని చేస్తాయి. కొవ్వును కరిగించగల శారీరక సామర్థాన్ని పెంచుతాయి. పచ్చి అరటిలోని కొలెస్టరాల్ స్థాయిని తగ్గించడంలో సహకరించటం ద్వారా బరువు తగ్గడానికి దోహద పడతాయి.

తాజా అరటిపండ్లు ఏడాది మొత్తం దొరుకుతాయి. అధిక ఉష్ణోగ్రతలో వీటిని నిల్వ చేస్తే నల్లగా అయి పోతుంది గానీ లోపల పండు బాగానే ఉంటుంది. అరటిపండు అన్ని పండ్ల కంటే ఖరీదులో చౌక. అందుబాటులో కనిపించే ఈ పండుని రోజుకి ఒక్కటైనా తింటే ఎంతో మంచిది.

Banana is good for Health

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోజుకొక పండు తింటే చాలు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.