ఠాణా ముందే ఎఎస్‌ఐ ఆత్మహత్యా యత్నం

  బాలాపూర్: ఇన్‌స్పెక్టర్ వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్ ఎదుటే ఎఎస్‌ఐ వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లోని క్రైం విభాగంలో ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కె నర్సింహ్మా కుమారుడు సాయికిరణ్ బావమరిది వివాహ వేడుకలు ఈ నెల 15వ తేదీన స్థానిక ఎస్‌పిఆర్ గార్డెన్స్‌లో జరిగాయి. ఈ క్రమంలో వివాహం జరిగే రోజు రాత్రి సుమారు 11.30 గంటలకు […] The post ఠాణా ముందే ఎఎస్‌ఐ ఆత్మహత్యా యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాలాపూర్: ఇన్‌స్పెక్టర్ వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్ ఎదుటే ఎఎస్‌ఐ వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లోని క్రైం విభాగంలో ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కె నర్సింహ్మా కుమారుడు సాయికిరణ్ బావమరిది వివాహ వేడుకలు ఈ నెల 15వ తేదీన స్థానిక ఎస్‌పిఆర్ గార్డెన్స్‌లో జరిగాయి. ఈ క్రమంలో వివాహం జరిగే రోజు రాత్రి సుమారు 11.30 గంటలకు పెట్రోల్ మొబైల్‌లో ఫంక్షన్‌హాల్‌కు వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లు డిజెను వెంటనే ఆపాలని సాయికిరణ్‌ను కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎఎస్‌ఐ నర్సింహ్మ, కానిస్టేబుళ్లకు మధ్య డిజె విషయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎఎస్‌ఐ నర్సింహ్మపై సదరు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి సైదులు ఆదేశించారు.

ఈ మేరకు నర్సింహ్మ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. కాగా ఎఎస్‌ఐ నర్సింహను బాలాపూర్ పొలీస్‌స్టేషన్ నుండి మంచాల పొలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.ఈ నేపధ్యంలో తీవ్ర మనస్ధాపానికి గురైన నర్సింహ్మ ఇన్‌స్పెక్టర్ సైదులు తనపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పించి,తన తప్పు లేకున్నా అన్యాయంగా తనను బదిలీ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా శుక్రవారం స్టేషన్ ప్రక్కనే ఉన్న ఓవర్‌హెడ్‌ట్యాంక్ ఎక్కిన ఎఎస్‌ఐ నర్మింహ ఇన్‌స్పెక్టర్ సైదుల వ్యతిరేకంగా కొంతసేపు నిరసన తెలిపిన అనంతరం తన వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్‌లోని పెట్రోల్ ఒంటిపై పోసుకొని నర్సింహ్మ నిప్పంటించుకున్నాడు. దీంతో నడుం పై భాగంలోని పొట్ట,ఛాతి,మోచేతుల క్రింది భాగాల్లో నర్సింహ్మకు కాలిన గాయాలయ్యాయి, విషయం గ్రహించిన తోటి సిబ్బంది వెంటనే ఎఎస్‌ఐ నర్సింహ్మను హుటాహుటిన డిఆర్‌డిఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా నర్సింహ్మ ఆరోగ్యపరిస్ధితి ప్రస్ధుతం ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ సైదులు వేధింపులే కారణం: ఎఎస్‌ఐ కుమారుడు సాయికృష్ణ
ఇన్‌స్పెక్టర్ సైదులు వేధింపుల కారణంగానే తన తండ్రి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని ఎఎస్‌ఐ కుమారుడు సాయికృష్ణ ఆరోపించాడు. 15వ తేదీన జరిగిన సంఘటనకు సంభంధించి ఇన్‌స్పెక్టర్ సైదులు తన తండ్రికి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు కావాలనే తప్పుడు నివేదిక సమర్పించాడన్నారు. ఫంక్షన్‌హాల్‌లో తన తండ్రితో వాగ్వివాదానికి దిగిన కానిస్టేబుల్ దశరధ్ మరో ఇద్దరు సిబ్బందితో కలిసి ఇన్సస్పెక్టర్ సైదులు కుమ్మక్కై తన తండ్రిని బాలాపూర్ నుండి బదిలీ చేయించడానికి కుట్రపన్నారన్నారు. .ఎలాగైనా తన తండ్రిని ఏదో ఒక తప్పులో ఇరికించాలన్న దురుద్ధేశ్యంతో గతంలో తన తండ్రికి సంభంధం లేని ఎస్.సి,ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బలవంతంగా ఆయనను విచారణకు పంపారన్నారు. ఇన్‌స్పెక్టర్ తరచూ వేధింపులకు గురిచేసినట్లు తన తండ్రి తనకు పలుమార్లు చెప్పాడని సాయికృష్ణ తెలిపాడు.అదేవిధంగా తన తండ్రికి ఏదైనా జరిగితే ఇన్‌స్పెక్టర్ సైదులుదే బాధ్యత వహించాలని సాయికృష్ణ డిమాండ్ చేశాడు.

Balapur ASI Attempts Suicide in Police Station premises

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఠాణా ముందే ఎఎస్‌ఐ ఆత్మహత్యా యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: