వైద్యుల నిర్లక్షం…కాలు కోల్పోయిన చిన్నారి

హైదరాబాద్: వైద్యుల నిర్లక్షం వల్ల ఓ చిన్నారి కాలు కోల్పోయిన సంఘటన నగరంలోని సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సకాలంలో చికిత్స అందివ్వకపోవడంతో చిన్నారి వికలాంగురాలైంది. పోలీసుల కథనం ప్రకారం…చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్త కబోర్డు కాలుపై పడింది. గాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే సనత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారికి చికిత్స చేయకుండా వైద్యులు కాలయాపన చేశారు. చివరి నిమిషంలో పరిస్థితి చేయిదాటిపోయిందని, చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. […] The post వైద్యుల నిర్లక్షం… కాలు కోల్పోయిన చిన్నారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: వైద్యుల నిర్లక్షం వల్ల ఓ చిన్నారి కాలు కోల్పోయిన సంఘటన నగరంలోని సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సకాలంలో చికిత్స అందివ్వకపోవడంతో చిన్నారి వికలాంగురాలైంది. పోలీసుల కథనం ప్రకారం…చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్త కబోర్డు కాలుపై పడింది. గాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే సనత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారికి చికిత్స చేయకుండా వైద్యులు కాలయాపన చేశారు. చివరి నిమిషంలో పరిస్థితి చేయిదాటిపోయిందని, చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు మరో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అక్కడి వైద్యులు చిన్నారి కాలును తీసివేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు కాలు కోల్పోయిందని తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

Baby leg lost with Doctors Negligence in Sanath nagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వైద్యుల నిర్లక్షం… కాలు కోల్పోయిన చిన్నారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: