ప్లాస్టిక్ బ్యాగ్‌లో పసికందు…బేబీ పేరు ఇండియా

Baby India

 

న్యూయార్క్: అమెరికాలోని జియోర్జియా ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉన్న పసికందును గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూన ఆరో తేదీన రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతం నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీస్ అధికారి షేరిఫ్ అక్కడికి చేరుకొని పసికందును స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. పసికందు ఆరోగ్యంగా ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బేబీ చాలా అందంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. పసికందును వదిలిపెట్టడానికి ఆ కన్నతల్లికి మనసు ఎలా వచ్చిందని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. సదురు బేబీకి ఇండియా అనే పేరు పెట్టారు. బేబీ ఇండియా అనే యాష్ ట్యాగ్ తగలించడంతో పాటు ఆ పసికందు తల్లిని గుర్తించండని  సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జియోర్జియా ప్రాంతంలో గర్భంతో ఉన్న మహిళల వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Baby Girl Found in Plastic Bag, cops name her ‘Baby India

 

The post ప్లాస్టిక్ బ్యాగ్‌లో పసికందు… బేబీ పేరు ఇండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.