గుండె స్థానం మారింది.. అయినా పాప ఆరోగ్యం క్షేమం

 Heart

 

మెదక్ : మెదక్ జిల్లా తుప్రాన్ మండలంలో ఓ శిశువు కుడివైపున గుండెతో జన్మించింది. ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉంది. అయితే మనుషులందరికీ ఎడమవైపున గుండె ఉంటుదన్న విషయం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు జన్యులోపాల వల్ల కొందరు కుడివైపు గుండెతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కోట్లలో ఒకరు ఇలా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆబోతుపల్లిలో నివాసముంటున్న రమ్య, రెండో కాన్పుకు నెలలు నిండుతోన్న సమయంలో సాధారణ పరీక్షల నిమిత్తం దగ్గరల్లోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు స్కానింగ్‌లో పాపకు కుడివైపు గుండె ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కౌన్సిలింగ్ ఇచ్చిన డాక్టర్లు, బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రమ్యకు నొప్పులు రావడంలో ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవంలోనేే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రమ్య. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.

Baby Born with a Heart on the right

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుండె స్థానం మారింది.. అయినా పాప ఆరోగ్యం క్షేమం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.