బాబ్రీ కేసు విచారణకు మరి ఆరునెలలు

 Babri Masjid

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను పూర్తి చేయడానికి మరో ఆరు నెలలు గడువు కావాలని స్పెషల్ జడ్జి సోమవారం సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసులో బిజెపి ప్రముఖులు ఎల్‌కె అద్వానీ, ఎంఎం జోషి, మరికొందరు ఉన్నారు. 2019 సెప్టెంబర్ 30న తను పదవీ విరమణ చేస్తున్నానని ఈ ఏడాది మే నెలలో స్పెషల్ జడ్జి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ సారథ్యం వహిస్తున్న ధర్మాసనానికి ఈ అంశం సోమవారం విచారణకు వచ్చింది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కేసులో తీర్పు వెలువడేంతవరకూ స్పెషల్ జడ్జి పదవీ కాలాన్ని పొడిగించేందుకు అనుసరించే ప్రక్రియను జూలై 19 నాటికల్లా తనకు వివరించాల్సిందిగా సుప్రీం ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయంగా సున్నితాంశంగా నిలిచిన 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసును రెండేళ్లలో పూర్తి చేసేందుకు రోజువారీ విచారణకు అత్యున్నత న్యాయస్థానం 2017 ఏప్రిల్ 19 న ఆదేశించింది.

 Babri demolition case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బాబ్రీ కేసు విచారణకు మరి ఆరునెలలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.