విటమిన్ బితో కాలుష్యం దూరం…!

B Vitamin

 

ఈ జీవన ప్రయాణంలో ఎక్కడికెళ్లినా వాయుకాలుష్యం బారిన పడకుండా ఉండడం కష్టతరంగా ఉంటుంది. దీని గురించి ఎన్ని జాగ్రత్తలు పాటించినా కాలుష్యం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాని పని. వాయు కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు తెలిసినవే! ఈ కాలుష్యం మన శరీరంలోని పలు అవయవాల మీద ప్రభావం చూపుతోందన్న విషయం విదితమే. వాయు కాలుష్యం వలన కలిగే అనర్థాల గురించి తెలిసినా బయట తిరగకుండా ఉండలేని పరిస్థితి.

బయటకు వెళ్లే సమయంలో ఈ కాలుష్యం బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యం. ఈ జాగ్రత్తలు తీసుకోకుండానే విటమిన్‌బితో కాలుష్య ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అమెరికా పరిశోధకులు. కొంత మందికి బి12 విటమిన్లు ఇచ్చి వాయుకాలుష్యం అధికంగా ఉండే ప్రాంతానికి పంపించారు. వీరిని పరిశీలించగా వాయుకాలుష్యం వీరి జన్యువుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అయితే బి విటమిన్ వాయు కాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుందన్న విషయం మొదటిసారి రుజువైంది. దీని మీద కచ్చితమైన నిర్ధారణకి ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది అంటున్నారు పరిశోధకులు.

B Vitamin Protects against Air Pollution

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విటమిన్ బితో కాలుష్యం దూరం…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.