‘పది’ విద్యార్థులకు భరోసా

ఫలితాలకు ముందు, తర్వాత కౌన్సెలింగ్ ఉపాధ్యాయులతో అవగాహన కల్పించేలా చర్యలు ఫలితాలకు ఒక రోజు ముందే పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి హైదరాబాద్: పదవ తరగతి విద్యార్థులకు ఫలితాల తర్వాత, ఫలితాలకు ముందు కౌన్సెలింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఫలితాలకు ముందు ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఆసక్తిగల ఉపాద్యాయులు స్థానికంగా ఉన్న మానసిక నిపుణులు, స్వయం సహాయక బృందాల మహిళలు, స్వఛ్చంద సంస్థల ప్రతినిధుల సహకారంతో మే 9 లేదా 10వ […] The post ‘పది’ విద్యార్థులకు భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫలితాలకు ముందు, తర్వాత కౌన్సెలింగ్
ఉపాధ్యాయులతో అవగాహన కల్పించేలా చర్యలు
ఫలితాలకు ఒక రోజు ముందే పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం
విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్: పదవ తరగతి విద్యార్థులకు ఫలితాల తర్వాత, ఫలితాలకు ముందు కౌన్సెలింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఫలితాలకు ముందు ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఆసక్తిగల ఉపాద్యాయులు స్థానికంగా ఉన్న మానసిక నిపుణులు, స్వయం సహాయక బృందాల మహిళలు, స్వఛ్చంద సంస్థల ప్రతినిధుల సహకారంతో మే 9 లేదా 10వ తేదీలలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేయాలని విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పదవ తరగతి తర్వాత ఉన్న అవకాశాల గురించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి.సుధాకర్, ఎస్‌సిఇఆర్‌టి సంచాలకులు శేషు కుమారి, ఇతర అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు 10వ తరగతి ఫలితాలకు ముందు, తర్వాత ఉపాధ్యాయులు నిర్వహించవలసని కౌన్సెలింగ్ మార్గదర్శకాలను రూపొందించారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల స్థాయిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 11,023 పాఠశాలల నుంచి విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల సందర్భంగా విద్యార్థుల్లో రకరకాల భావోద్వేగాలు కనిపిస్తుంటాయని, అనుకున్న విధంగా ఫలితాలు పొందిన విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు, అనుకున్న ఫలితాలు పొందలేక పోయిన విద్యార్థులు నిరాశకు లోనవడం చూస్తుంటామని అన్నారు. పరీక్షల్లో అనుత్తీర్ణత వల్ల మనస్తాపం వంటి భావోద్వేగాలను విద్యార్థుల్లో గమనిస్తామని తెలిపారు. మరికొంత పిల్లల ఫలితాలను చూసి నిరాశకుగురి కావచ్చని పేర్కొన్నారు. ఉపాధ్యాయులుగా గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలతో గడపడం, వారిని పరిశీలించిన అనుభవం ద్వారా ఏ విద్యార్థి ఏ రకమైన భావోద్వేగానికి గురవుతారో అంచనా వేయవచ్చని తెలిపారు. 10 సంవత్సరాలు పాఠశాల విద్యనందించిన మనం 10వ తరగతి ఫలితాల సందర్భంగా ముందే వారికి వెన్నుదన్నుగా ఉండి వారు నిరాశకు గురికాకుండా చూసేందుకు ప్రయత్నించాలని సూచించారు.

విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మనం అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలని తెలిపారు. పాఠశాల విద్యాగమనంలో పబ్లిక్ పరీక్షలు ఒక మజిలీ వంటివి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఎన్నో రాయాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పరీక్షల గురించి ఏ విద్యార్థి కూడా ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురికాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులుగా మనందరం తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. పరీక్షల కన్నా జీవితం చాలా విలువైందని, జీవితం గొప్పతనాన్ని తెలియజేయాలని తెలిపారు. విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జీవితం పట్ల నమ్మకాన్ని పెంపొందించి పునరుత్తేజితులను చేసి, వారి భవితకు బాటలు వేయాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా పిల్లలు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా ప్రయత్నలోపం లేకుండా కష్టపడి, శ్రమించి కృషి చేయాలని, అంతేకానీ ఫలితాలపై అంతగా ఆందోళన చెందకూడదనే భావవను కలిగించాలని తెలిపారు.

విద్యార్థులకు ఉన్న అవకాశాలను తెలియజేయాలి

10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన తరువాత ఏం చదవాలి..? ఏ ఏ కోర్సులు చేయాలి..? వంటి వాటిపట్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. 10వ తరగతి తర్వాత ఉన్న కోర్సులు, అవకాశాల గురించి తెలియజేయాలని అన్నారు. 10వ తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి ఉత్తీర్ణత పొందే అవకాశాలున్నాయనే నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. కారణాలేమైనప్పటికీ 10 తరగతి తరువాత చదువుమానేసే విద్యార్థులకు దూరవిద్యా విధానం ద్వారా కూడా చదువుకునే అవకాశాల గురించి వివరించాలని చెప్పారు.

గత ఐదు సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖలో పరీక్షల సంస్కరణలు అమలవుతున్నాయని, బట్టి విధానాలతో పరీక్షల్లో ఒత్తిడి ఎదుర్కొన్న విద్యార్థులకు నిరంతరం సమగ్ర మూల్యాంకనం ద్వారా ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. 100 మార్కుల్లో 80 మార్కులకే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం, 20 మార్కులను అంతర్గత మూల్యాంకనం ద్వారా పాఠశాలల్లో విద్యార్థి అభ్యసనానికి కేటాయించడం ద్వారా ఒత్తిడిని నివారించగలిగామని తెలిపారు. గతంతో పోల్చితే విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం కూడా గణనీయంగా పెరిగిందని, పరీక్షలంటే ఉండే భయం తగ్గిందని అన్నారు.

విద్యార్థులకు అండగా ఉండాలి

పదవ తరగతి ఫలితాల ప్రకటన కంటే ముందే పాఠశాలలో ఒక రోజు తల్లిదండ్రులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఏ విద్యార్థి అధైర్యపడకూడదని, నిరుత్సాహానికి గురికావద్దని, తాము అండగా ఉన్నామని ఉపాధ్యాయులు విద్యార్థులకు భరోసా ఇవ్వాలి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అత్యధిక అంచనాలను కలిగి ఉండకూడదని, పిల్లల వాస్తవిక స్థాయిని గుర్తించేలా తల్లిదండ్రులకు అర్థం చేయించాలి. సాధారణంగా ఇటీవల తమ పిల్లలను ఇంటర్మీడియేట్‌లో గణితం, సైన్స్ కోర్సుల్లో చేరుస్తున్నారు.

ఇందుకోసం కష్టపడి సంపాదించిన సొమ్మును ధారపోస్తున్నారు. అయితే ఆ విద్యార్థులు ఆయా కోర్సులు చదివే స్థాయి ఉందో లేదో తల్లిదండ్రులకు వివరించాలి. 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారి కోసం అందుబాటులో ఉన్న ఇంటర్మీడియేట్, పాలిటెక్నిక్ కోర్సులు, ఐటిఐ, ఒకేషనల్ కోర్సులు, ఇంజనీరింగేతర కోర్సులు(హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్, ఫుడ్ టెక్నాలజి, డైరీ, సెరీకల్చర్, ఫిషరీస్, పౌల్ట్రీ కోర్సులు, ఇంటీరియర్ డిజైనింగ్, గార్మెంట్ టెక్నాలజి), కంప్యూటర్ కోర్సులు, టి.వి. రేడియో, రిఫ్రిజిరేటర్, ఎ.సి, గడియారాలు, మొబైల్ ఫోన్ల రిపేరింగ్ కోర్సుల గురించి వివరించాలి. సబ్జెక్టుల వారీగా ఫెయిలైన విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలి.

ఇందుకోసం పాఠశాలలో సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు, అనువజ్ఞులైన పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులైన స్థానిక యువత వంటి వారి సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఒక్కొక్క సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడానికి గల కారణాలను విశ్లేషించి,పునర్బోధన ద్వారా పునరభ్యాసం కల్పించాలి. తక్కువ గ్రేడ్ వచ్చిందని నిరుత్సాహపడే విద్యార్థుల కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గురించి తెలియజేసి దరఖాస్తు చేయించాలి.

B Janardhan Reddy Talks About 10 Class Results

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘పది’ విద్యార్థులకు భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: