అయోధ్యలో బహుళ అంచెల భద్రత

Ayodhya

కీలక కూడళ్లలో డ్రోన్ కెమెరాలు, సిసిటివిలు ఏర్పాటు
పిఎసి, ఇతర పారామిలటరీ బలగాల మోహరింపు, రెండు హెలికాప్టర్లు రెడీ
సుప్రీంతీర్పు నేపథ్యంలో భద్రతా వలయంలో నగరం

అయోధ్య: అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు భూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు శని వారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో యుపిలోని అయోధ్యలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, శాంతభద్రతల పరిస్థితిని పర్యవేక్షించడానికి డ్రోన్‌లను కూడా ఉపయోగి స్తున్నారు. రామజన్మభూమి పోలీసు స్టేషన్ సమీప ప్రాంతం, రామజన్మభూమి న్యాస్ కార్యక్షేత్రం లేదా పట్టణంలోని ఇతర ప్రాంతాలు ఎక్కడ చూసినా పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తూ కనిపిస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్ల గురించి రాష్ట్ర అదనపు డిజిపి (శాంతిభద్రతలు) పివి రామశాస్త్రి పిటిఐకి వివరిస్తూ అయోధ్యతో పాటుగా రాష్ట్రంలోని ఇతర సున్నిత జిల్లాలకు తగినంత మంది పోలీసు బలగాలను సమకూర్చడం జరిగిందని చెప్పారు. అంతేకాదు, సిఎపిఎఫ్, పిఎసి కంపెనీల సిబ్బంది శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచడం జరిగిందని కూడా ఆయన చెప్పారు.

గత రెండు నెలల కాలంలో ఈ బలగాలకు మెరుగైన ఆయుధాలు, శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సంఖ్యనే కాకుండా సామర్థాన్ని కూడా గణనీయంగా పెంచడం జరిగిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రణాళిక రూపకల్పనలో సీనియర్ అధికారులకు ప్రమేయం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారా అని అడగ్గా ముందస్తు సన్నద్ధత దశలో వాటిని ఉపయోగించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లోను, ఎత్తయిన భవనాలపైన రాళ్లు సమకూర్చుకోకుండా చూడడం కోసం డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నట్లు రామశాస్త్రి చెప్పారు. ఎన్‌ఎస్‌జి దళాలను కూడా నియోగించే అవకాశం ఉందా అని అడగ్గా, లేదని చెప్పారు. ఏదయినా అనుకోని సంఘటన ఎదురైతే ఈ బలగాలు వాటి స్థావరాల్లోనే అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

గత నెల రోజులుగా పట్టణ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని, ధర్మ గురువులు, వ్యాపారులు, విద్యావేత్తలు .. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారిని కలిసి వాళ్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. పోలీసుల రక్షణలో తాము భద్రంగా ఉన్నామనే భావన కల్పించడమే ఈ యత్నాల ప్రధాన ఉద్దేశమని రామశాస్త్రి చెప్పారు. కాగా పట్టణంలో 60 కంపెనీల పిఎసి, నారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అదనపు డిజి (ప్రాసిక్యూషన్) అశుతోష్ పాండే చెప్పారు. 30 కూడళ్ల వద్ద పది డ్రోన్ కెమెరాలను, 30కి పైగా సిసిటీవీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే బాబ్రీమసీదు ప్రాంతంలోని రామ్‌లల్లా వద్ద బారికేడ్లను పటిష్ఠం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.

సిద్ధంగా రెండు హెలికాప్టర్లు

రామజన్మభూమిబాబ్రీమసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్టా రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా రెండు హెలికాప్టర్లు లక్నో, అయోధ్యలో సిద్ధంగా ఉంచనున్నట్లు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అధికారులతో గురువారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు హెలికాప్టర్లను ఉపయోగించాలన్నారు.

Ayodhya Verdict Tomorrow

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అయోధ్యలో బహుళ అంచెల భద్రత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.