జీలుగు సాగుపై రైతులకు అవగాహన

  మన తెలంగాణ, హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో రైతులకు జీలుగు సాగుపై వ్యవసాయాధికారులు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతు గూడూరి స్వామిరెడ్డి వరి పొలంలో సాగు చేసిన జీలుగు పంటను అధికారులు సందర్శించారు. అనంతరం ఎడిఎ దోమ ఆదిరెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ డివిజన్‌లో వరి మాగానిలో ప్రతి రైతుకు జీలుగు సాగుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎక్కువ మంది రైతులు జీలుగు సాగు చేస్తున్నారని, […] The post జీలుగు సాగుపై రైతులకు అవగాహన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 


మన తెలంగాణ, హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో రైతులకు జీలుగు సాగుపై వ్యవసాయాధికారులు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతు గూడూరి స్వామిరెడ్డి వరి పొలంలో సాగు చేసిన జీలుగు పంటను అధికారులు సందర్శించారు. అనంతరం ఎడిఎ దోమ ఆదిరెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ డివిజన్‌లో వరి మాగానిలో ప్రతి రైతుకు జీలుగు సాగుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎక్కువ మంది రైతులు జీలుగు సాగు చేస్తున్నారని, జీలుగు సాగు వల్ల భూమిలో సారం పెరిగి అధిక దిగుబడి వస్తుందన్నారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ డివిజన్ ఐదు మండలాల్లో 950క్వింటాల జీలుగు విత్తనాలు సరఫరా చేశామన్నారు. రాబోయే రోజుల్లో జీలుగు విత్తనంపై ప్రతి రైతుకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సునీల్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్‌రెడ్డి, రైతులు మల్లారెడ్డి, గోపు నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Awareness on Jilugu Cultivation in Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జీలుగు సాగుపై రైతులకు అవగాహన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: