ఆరోగ్య సమస్యలపై అవగాహన

జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై అవగాహన, భవిష్యత్తు సంసిద్ధత, సామాజిక మార్పు అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం స్థానిక యంవిఎస్ కళాశాల సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వాయిస్ ఫర్ గర్ల్ సోషల్ చేంజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఉరర్జ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, యంవిఎస్ కళాశాలలోని ఎంపిక చేసిన 1 40 మంది విద్యార్థినిలు […]
జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్

మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై అవగాహన, భవిష్యత్తు సంసిద్ధత, సామాజిక మార్పు అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం స్థానిక యంవిఎస్ కళాశాల సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వాయిస్ ఫర్ గర్ల్ సోషల్ చేంజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఉరర్జ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, యంవిఎస్ కళాశాలలోని ఎంపిక చేసిన 1 40 మంది విద్యార్థినిలు ఫిబ్రవరి 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు శిక్షణనివ్వడం జరిగిందన్నారు.

మహిళా సాధికారత అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత, బలహీనలతను అధిగమించడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై అ వగాహన, భవిష్యత్తు సంసిద్దత, సామాజిక మార్పు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించడం, మహిళల వ్యక్తిగత అంశాలపై చర్చించడం, గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకు ఈ శిక్షణ ద్వారా విఙ్ఞానం అందించడం జరుగుతుందన్నారు. క మ్యూనిటీ అవుట్‌రీచ్ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన డిగ్రీ వి ద్యార్థినీలు, పాఠశాల విద్యార్థులతో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే టీచర్‌గా, ఆత్మస్థయిర్యంతో, సంతోషం, స మాజానికి ఏమైనా చేయాలనే తపన పెంపొందిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఐఎఎస్ క్రాంతి, అనూష, భరద్వాజ్, ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Awareness on Health Issues to Students in Mahabubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: