తొలి వన్డే: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్

 

ముంబయి: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకుని.. ముందుగా టీమిండియాని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ సిరీస్ కు టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ తిరిగి జట్టులో చేరాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు ట్వీం20 సిరీస్ ను 2-0తో గెలుచుకొని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించిన భారత్, ఆసీస్ తో జరుగుతున్న ఈ సిరీస్ ని కూడా గెలిచి సత్తా చాటలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా కూడా సిరీస్ పై కన్నేసింది. కాగా, రెండు బలమైన జట్లు తలపడుతుండడంతో క్రికెట్ అభిమానులకు కావాల్సిన వినోదం దొరకడం కాయం. ఇక, భారత్ గడ్డపై వన్డేల్లో గత రికార్డులు మాత్రం టీమిండియాపై ఆసీస్ దే ఆధిపత్యమని చెప్పుతున్నాయి. ఇప్పటి వరకూ 61 మ్యాచ్‌ల్లో తలపడితే 29 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 27 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మరి ఆసీస్ ఆధిపత్యానికి కోహ్లీసేన చెక్ పెడుతుందో చూడాలి.

 

Australia win toss and opt bowl against India

The post తొలి వన్డే: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.