ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా దూరం

సిడ్నీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలో జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. కరోనా తీవ్రంగా మారిన పరిస్థితుల్లో ఒలింపిక్స్‌కు దూరంగా ఉండడమే మంచిదని ఆస్ట్రేలియా ఒలింపిక్ సమాఖ్య నిర్ణయించింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహించడం మంచిది […] The post ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా దూరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిడ్నీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలో జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. కరోనా తీవ్రంగా మారిన పరిస్థితుల్లో ఒలింపిక్స్‌కు దూరంగా ఉండడమే మంచిదని ఆస్ట్రేలియా ఒలింపిక్ సమాఖ్య నిర్ణయించింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహించడం మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా వ్యక్తం చేసింది. ఇక, క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా క్రీడల నుంచి వైదొలగడమే మంచిదని ఆస్ట్రేలియా భావించింది.

ఈ మేరకు వివిధ క్రీడా సంఘాలు, స్టార్ అథ్లెట్లతో చర్చించిన తర్వాత పోటీల నుంచి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. కాగా, జులై చివర్లో టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ పోటీలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగడం అనుమానంగా మారింది. క్రీడలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఇప్పటికే పలు దేశాల ఒలింపిక్ సంఘాలు కోరుతున్నాయి. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. జపాన్ ప్రభుత్వం మాత్రం నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పోటీలను నిర్వహించాలని భావిస్తోంది. కానీ, ఇప్పటికే రెండు పెద్ద దేశాలు పోటీల నుంచి తప్పుకోవాలని నిర్ణయించడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలను వాయిదా వేయాలని సూచించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఒలింపిక్స్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది.

Australia will not participate in Tokyo Olympics 2020

The post ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా దూరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: