ఆసీస్‌తో ఇంగ్లండ్ సమరం

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే రెండో సెమీఫైనల్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇందులో గెలిచే జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వరుస విజయాలతో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్న ఇంగ్లండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచుల్లో భారత్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను చిత్తు చేసి సెమీస్‌కు చేరుకుంది. ఇక, […] The post ఆసీస్‌తో ఇంగ్లండ్ సమరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే రెండో సెమీఫైనల్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇందులో గెలిచే జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వరుస విజయాలతో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్న ఇంగ్లండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచుల్లో భారత్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను చిత్తు చేసి సెమీస్‌కు చేరుకుంది. ఇక, ఆస్ట్రేలియాతో జరిగే పోరులోనూ గెలుపే లక్షంగా పెట్టుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్‌కు ఎదురులేదు. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఇంగ్లండ్ తర్వాత పరాజయాల బాట పట్టింది. అయితే కీలక దశలో మళ్లీ అనూహ్యంగా పుంజుకుంది. ఏమాత్రం ఆశలులేని స్థితిలో కీలక విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టోలతో పాటు జోరూట్, కెప్టెన్ మోర్గాన్, జోస్ బట్లర్ తదితరులు భీకర ఫామ్‌లో ఉన్నారు. బెన్‌స్టోక్స్ కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. రూట్ ఇప్పటికే వరుస శతకాలతో ప్రకంపనలు సృష్టించాడు. కెప్టెన్ మోర్గాన్ కూడా జోరుమీదున్నాడు.

జాసన్ రాయ్, బెయిర్‌స్టోలు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బట్లర్ కూడా అవకాశం దొరికితే చెలరేగి పోతున్నాడు. స్టోక్స్ కూడా దూకుడుగా ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్‌కు ఎదుదులేదనే చెప్పాలి. ఆర్చర్, ఫ్లంకెట్, మార్క్‌వుడ్, వోక్స్, రషీద్, స్టోక్స్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక, ఆస్ట్రేలియా కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. అయితే కీలక ఆటగాళ్లు గాయం వల్ల జట్టుకు దూరం కావడం కాస్త ఆందోళన కలిగించే పరిణామమే. కానీ, డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉండడం జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. ఆస్ట్రేలియాను సెమీస్‌కు చేర్చడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఫించ్ కూడా జోరుమీదున్నాడు. కాగా, ఫామ్‌లో ఉన్న ఉస్మాన్ ఖ్వాజా జట్టుకు దూరం కావడం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. వికెట్ కీపర్ కారే కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. సీనియర్ ఆటగాడు మాక్స్‌వెల్ ఆశించిన స్థాయిలో రాణించక పోవడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. కీలకమైన సెమీస్ సమరంలో సత్తా చాటాలనే పట్టుదలతో మాక్స్‌వెల్ ఉన్నాడు. అతను విజృంభిస్తే ఆస్ట్రేలియాకు విజయం నల్లేరుపై నడకే. ఇక, బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. బెహ్రాన్‌డార్ఫ్, కమిన్స్, స్టోయినిస్ తదితరులు కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. లియాన్ రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

australia vs england world cup 2019 semi final

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆసీస్‌తో ఇంగ్లండ్ సమరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: